Rashmika Mandanna : నన్ను మగాడిలా కనిపిస్తున్నావంటూ ట్రోల్స్ చేస్తున్నారు.. రష్మిక ఎమోషనల్..!
NQ Staff - January 24, 2023 / 11:29 AM IST

Rashmika Mandanna: ఈ నడుమ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు దారుణంగా అవమానాలకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ కొంచెం పొరపాటు దొరికినా సరే సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ మరీ ఎక్కువ అయిపోతున్నారు. ఇలాంటి ట్రోల్స్ కొన్ని సార్లు వారిని మానసిక వేదనకు గురి చేస్తుంటాయి. కొందరు వాటిపై పోలీస్ కంప్లయింట్లు కూడా చేస్తున్నారు. తాజాగా రష్మిక కూడా ఇలాంటి ట్రోల్స్ మీద కామెంట్లు చేసింది.
ఆమె గురించి అందరికీ బాగా తెలుసు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో నటించిన గీతా గోవిందం సినిమా ఆమెకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దీని తర్వాత ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఆ ట్రోల్స్‌ను చూస్తే..
ఇక పుష్ప సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్ లో ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా ఆమె బాలీవుడ్ లో చేసిన మూవీ మిస్టర్ మజ్ను. ఈ మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నడుమ వస్తున్న ట్రోల్స్‌ను చూస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవాలనిపిస్తోంది. ఎందుకంటే నా బాడీ ఎలా ఉన్నా సరే వారికి ఇబ్బందిగానే ఉంటుంది.
కొన్ని సార్లు నా వర్కౌట్స్ చూసి నేను మగాడిలా ఉన్నానంటూ కామెంట్లు చేస్తున్నారు. నేను మాట్లాడితే భయపడుతోందని, మాట్లాడకపోతే పొగరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాంటివి చూసినప్పుడు చాలా బాధ వేస్తోంది. ట్రోలర్స్ నాలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారో చెప్పండి అలా మారుతా అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది రష్మిక.