Netizens Are Trolling Eesha Rebba : షాకింగ్.. పెళ్లి కాకుండానే తల్లి అయిన ఈషారెబ్బా.. బయట పడ్డ సీక్రెట్..!
NQ Staff - July 19, 2023 / 09:44 AM IST

Netizens Are Trolling Eesha Rebba :
ఈ నడుమ సినీ సెలబ్రిటీలు కొత్త ట్రెండ్ కు దారి తీస్తున్నారు. అదేంటంటే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఇలాంటి ట్రెండ్ ఎక్కువగా మనకు హాలీవుడ్ లోనే వినిపించేది. కానీ ఇప్పుడు ఇండియాకు కూడా పాకింది. ఇప్పటికే ఇలియానా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిపోయింది. గతంలో ఆలియా భట్ కూడా అంతే.
ఇక తాజాగా తెలుగు అమ్మాయి ఈషారెబ్బా కూడా తాను తల్లిని అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. జేడీ చక్రవర్తితో తో కలిసి దయా అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈషారెబ్బా. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఈశా రెబ్బా, జెస్సి, గౌతమి, రవి వర్మ తదితరులు సుమ అడ్డా ప్రోగ్రామ్ కు వచ్చారు.
తాజా ఎపిసోడ్ లో..

Netizens Are Trolling Eesha Rebba
తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో సుమ మాట్లాడుతూ.. పెళ్లి త్వరగా చేసుకోవాలని ఏ టైంలో అనిపిస్తుంది అని అడిగితే.. పెళ్లి జరగకముందే తొందరపడినప్పుడు అంటూ ఈషా రెబ్బా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమ గురించి ఏదైనా చెప్పమని యాంకర్ సుమ అడిగింది.
ఈషారెబ్బా మాట్లాడుతూ.. నాకు పిల్లలు ఉన్నారు అంటూ బాంబు పేల్చింది. దాంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు. అవునా.. మరి వాళ్ల నాన్న ఎక్కడున్నారు అని సుమ అడిగింది. అక్కడితోనే ప్రోమో ఎండ్ అయిపోయింది. దానికి ఈషా ఏం సమాధానం చెప్పిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది నిజం కాదని.. కేవలం టీఆర్పీ స్టంట్ మాత్రమే అంటూ కొట్టి పారేస్తున్నారు కొందరు.