Netizens Are Trolling Chiranjeevi : బాలయ్యతో పోలుస్తూ చిరును ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఈ సారి ఫొటోల వార్..!
NQ Staff - August 28, 2023 / 10:45 AM IST

Netizens Are Trolling Chiranjeevi :
చిరంజీవి, బాలయ్య నడుమ బాక్సాఫీస్ వార్ ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరూ ఇద్దరే. పైగా ఇద్దరూ మాస్ హీరోలే. వీరిద్దరి సినిమాలు చాలాసార్లు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీ పడ్డాయి. అందుకే వారి ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్ నడిపిస్తూ ఉంటారు. రీసెంట్ గా వీరిద్దరూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో పోటీ పడ్డారు. క్రేజీగా ఇద్దరూ హిట్ కొట్టారు. అయితే ఇప్పుడు ఇద్దరి నడుమ మరో వార్ నడుస్తోంది. అది కూడా ఫొటో వార్. ఈ విషయంలో ఇరువురి అభిమానులు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఏకిపారేస్తున్నారు.
ముఖ్యంగా బాలయ్యతో పోలుస్తూ చిరంజీవిని తిట్టిపోస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. రీసెంట్ గా జరిగిన స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీలో నటిస్తున్న శ్రీలీలను ఆయన ఆప్యాయంగా ఆశీర్వదించారు. తలపై చేయి వేసి ప్రేమతో నిమిరారు. ఇందుకు ఓ కారణం కూడా ఉందండోయ్. బాలయ్య ఇప్పుడు నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఆ ప్రేమతోనే ఆయన ఇలా చేశారు. అయితే మొన్న చిరంజీవి నటించిన భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఇందులో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించింది. తన కూతురు కంటే చిన్న వయసు కలిగిన కీర్తి సురేష్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అంతే కాకుండా ఆమె చేతిని తన సంకలో పెట్టుకున్నారు. పైగా కీర్తి సురేష్ పై చిరంజీవి చేసిన చిలిపి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అవన్నీ చిరు స్థాయికి తగినవి కావంటూ తిట్టిపోశారు. అయితే ఇప్పుడు చిరంజీవి కీర్తి సురేష్ ను హత్తుకున్న ఫొటోను, బాలయ్య శ్రీలీలను ఆశీర్వదిస్తున్న ఫొటోలను కంపేర్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Netizens Are Trolling Chiranjeevi
తన కూతురు పాత్రలో నటించిన అమ్మాయితో బాలయ్య ఇలా నడుచుకుంటాడు. కానీ చిరంజీవి మాత్రం తన చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయిని కౌగిలించుకుని నలిపేస్తాడు. ఇది వారిద్దరి మధ్య సంస్కారం అంటూ చిరంజీవిని తిట్టి పోస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. అవన్నీ చిరంజీవి ఆప్యాయంగా చేసినవే తప్ప.. ఆయన మనసులో ఎలాంటి ఉద్దేశం లేదని చెబుతున్నారు.
అదే సమయంలో గతంలో బాలయ్య మహిళలపై చేసిన వల్గర్ కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆడది కనిపిస్తే కడుపు చేయాలి అని గతంలో బాలయ్య చెప్పిన మాటలను ఇప్పుడు వైరల్ చేస్తూ తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో మరోసారి సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి వార్ నడుస్తోంది. హీరోలు బాగానే ఉంటారు గానీ.. ఈ ఫ్యాన్స్ మితిమీరిపోయి ట్రోల్స్ చేసుకుంటున్నారు.