Keerthy Suresh : నా భర్తకు తప్ప ఎవరికీ లిప్ లాక్ ఇవ్వను.. కీర్తి సురేష్ షాకింగ్ ఆన్సర్..!
NQ Staff - June 21, 2023 / 11:44 AM IST

Keerthy Suresh : సౌత్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో దూసుకుపోతోంది కీర్తి సురేష్. ఆమె నటిస్తున్న సినిమాలు ఇప్పుడు వరుసగా పెద్ద హిట్ అవుతున్నాయి. మొన్ననే ఆమె నటించిన దసరా మూవీ ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అయితే కీర్తి ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆమె ఏ సినిమాలో కూడా హద్దులు దాటలేదు.
ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా బెడ్ రూమ్ సీన్లు, లిప్ లాక్ లాంటి సీన్లలో కూడా నటించలేదు. ఆమె అలాంటి సీన్లలో నటించకూడదని రూల్ పెట్టుకుందని తెలుస్తోంది. ఇదే విషయంపై తాజాగా ఆమెను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. ఆన్సర్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ నేను అలాంటి సీన్లలో నటించకూడదని ముందే కండీషన్ పెట్టుకున్నాను.
అందుకే ఇప్పటి వరకు అలాంటి సీన్లు చేయలేదు. మా అమ్మానాన్నలకు కూడా ఇది ముందే చెప్పాను. కేవలం నా భర్తకు తప్ప ఇంకెవరికీ నేను ఆ ఛాన్స్ ఇవ్వను అంటూ తెగేసి చెప్పేశాను అంటూ తెలిపింది కీర్తి సురేష్. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ ఇలాంటి కామెంట్లు చేయడం పట్ల ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కీర్తి సురేష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంతోషకరం అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆమె చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాను చేస్తోంది. దాని తర్వాత ఆమె మరో సినిమా గురించి అప్ డేట్ రాలేదు.