Prabhas : వారి అకౌంట్లలో రూ.10 వేలు వేసిన ప్రభాస్.. గొప్పోనివయ్యా..!
NQ Staff - June 16, 2023 / 09:10 AM IST

Prabhas : ప్రభాస్ అంటేనే భోళా శంకరుడు అని అంటారు. ఎందుకంటే ఆయన ప్రేమకు హద్దులు ఉండవు. ఆయన చేతికి ఎముకలు ఉండవు. ఆపద సమయాల్లో మిగతా హీరోలు లక్షల్లో ఇస్తే.. ప్రభాస్ మాత్రం కోట్లలో ఇస్తుంటారు. ఇక ఇంటికి ఎవరు వచ్చినా కమ్మటి భోజనంతో కడుపు నిండా పెడుతుంటాడు.
ఇక తాజాగా ఆయన చేసిన మరో పని అందరితో శభాష్ అనిపిస్తోంది. ఆదిపురుష్ మూవీ రిలీజ్ సందర్భంగా.. సలార్ సినిమా సహాయ సిబ్బందికి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.10వేల చొప్పున వేశాడు ప్రభాస్. తమకు తెలియకుండా అకౌంట్లలో డబ్బులు పడటంతో వారంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇక ప్రభాస్ వేశాడని తెలుసుకుని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీని కుటుంబ సమేతంగా చూడాలనే ఉద్దేశంతోనే ప్రభాస్ ఇలా డబ్బులు వేశాడేమో అని అంటున్నారు. వారి అవసరాలకు ఇలా సాయం చేశాడని ప్రభాస్ ను కొనియాడుతున్నారు మరికొందరు.
ప్రభాస్ అంటే ఇలాగే ఉంటుంది మరి. భోజనం అయినా, సాయం అయినా.. లెక్కకు మించి చేస్తుంటాడు ప్రభాస్. తన సినిమాకు పని చేసే వారికి రకరకాల వంటలతో భోజనాలు పెట్టడం ప్రభాస్ కు అలవాటే. ఇక నేడు ఆదిపురుష్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో ప్రభాస్ హిట్ ట్రాక్ ఎక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.