Boss Party Song : వాల్తేరు వీరయ్య: బాస్ పార్టీనా.? ‘మెగా’ కలగూర గంపనా.?
NQ Staff - November 24, 2022 / 03:14 PM IST

Boss Party Song : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ నుంచి విడుదలైన తొలి లిరికల్ సాంగ్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. వ్యూస్, లైక్స్ పోటెత్తుతున్నాయ్. అంతేనా, నెగెటివిటీ కూడా ఈ సాంగ్ మీద గట్టిగానే కనిపిస్తోంది. కుప్పలు తెప్పలుగా మీమ్స్ వచ్చిపడుతున్నాయి.
ఓ వైపు ప్రశంసలు, ఇంకో వైపు వెటకారాలు.. వెరసి, ‘బాస్ పార్టీ’ సాంగ్ సంచలనమైతే కొనసాగుతూనే వుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఈ స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి డాన్సులేసింది.
ఇదేం కొరియోగ్రఫీ..
శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ అందించగా, ‘మారవా నువ్వు.?’ అంటూ ఏకిపారేస్తున్నారు మెగాభిమానులు. దేవిశ్రీ ప్రసాద్ మీద కూడా మెగాభిమానులు మండిపడుతున్నారు.. కాపీ ట్యూన్ అంటూ.
‘ఘరానా మొగుడు’, ‘ముఠామేస్త్రి’ సహా మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు సినిమాల్లోని డాన్స్ స్టెప్స్‌ని అచ్చంగా అలాగే దించేశారనే విమర్శలు ‘బాస్ పార్టీ’ సాంగ్ మీద వినిపిస్తున్నాయి. ‘ఆ మ్యాజిక్ ఇంకోసారి తెరపై చూడాలని వుందా.?’ అంటూ పాత సినిమాల్లోని మెగాస్టార్ డాన్స్ మూమెంట్స్‌ని మెగాభిమానులు షేర్ చేస్తున్నారు.. ఈ కొత్త పాటతో పోలిక పెట్టి.