Sudheer And Rashmi : అసలంటూ సుధీర్, రష్మిల మధ్య ఏం జరుగుతోంది.?
NQ Staff - November 8, 2022 / 11:10 PM IST

Sudheer And Rashmi : కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు.? అన్న ప్రశ్న అప్పట్లో హాట్ టాపిక్. ‘బాహుబలి ది బిగినింగ్’ నుంచి ‘బాహుబలి ది కంక్లూజన్’ వరకూ నరాలు తెగే ఉత్కంఠను రేపింది ఈ ప్రశ్న.
మరి, సుధీర్ – రష్మిల మధ్య ఏం జరుగుతోంది.? అన్న ప్రశ్నకు సమాధానమెప్పుడు దొరుకు తుంది. తెలుగునాట ఎంటర్టైన్మెంట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేర్లు సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్.
జబర్దస్త్ పెయిర్..
బుల్లితెరపై సుధీర్ – రష్మిల జంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ టాప్ క్లాస్. నటిస్తున్నారని అస్సలు అనిపించదు. నిజంగానే ఇద్దరూ లవర్స్ అయి వుంటారన్న అభిప్రాయం కలుగుతుంటుంది.. వారిద్దరి మధ్యా నడిచే రొమాంటిక్ ట్రాక్స్ చూస్తే.
ఆ ట్రాక్ అంత సక్సెస్ అయ్యింది కాబట్టే, తమ మధ్య ఏమీ లేదు.. అని ఈ ఇద్దరూ ఎప్పుడూ చెప్పరు. ‘సమయం వచ్చినప్పుడు చెబుతాం..’ అని అంటుంటారు ఈ ఇద్దరూ. తాజాగా, ఇంకోసారి ఇదే ప్రశ్న రష్మి ముందుకు వస్తే, ‘చెప్తా.. ముందు ముందు అన్ని విషయాలూ మాట్లాడతా..’ అనేసి ఊరుకుంది.
‘అబ్బే, అంతా తూచ్..’ అనేస్తే బుల్లితెరపై ఆ కెమిస్ట్రీ వర్కవుట్ అవడం కుదరదేమో.. అందుకే, వీలైనంత ఎక్కువ కాలం ఈ సస్పెన్స్ ఇలా కొనసాగిస్తుంటారు ఈ ఇద్దరూ.