Nagarjuna : నాగార్జున చేసిన పని వల్లే అఖిల్ స్టార్ హీరో కాలేకపోతున్నాడా.. కారణం ఇదే..!

NQ Staff - March 5, 2023 / 05:00 PM IST

Nagarjuna : నాగార్జున చేసిన పని వల్లే అఖిల్ స్టార్ హీరో కాలేకపోతున్నాడా.. కారణం ఇదే..!

Nagarjuna : నాగార్జున ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్నాడు. అక్కినేని నాగేశ్వర్ రావు అంత కాకపోయినా.. కుడి ఎడమ అన్నట్టుగా రాణిస్తున్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన కొడుకులు మాత్రం స్టార్ హీరోలు కాలేకపోతున్నారు. పెద్ద కొడుకు నాగచైతన్య అంతో ఇంతో పర్వాలేదని పిస్తున్నాడు. ఆయన సినిమాలు యావరేజ్ గా ఆడుతున్నాయి.

కానీ ఎటొచ్చి అఖిల్ మాత్రం అక్కినేని అభిమానుల అంచనాలను అందుకోలేక సతమతం అవుతున్నాడు. అఖిల్ మీద భారీ హైప్ తేవడంలో నాగార్జున మొదట్లో సక్సెస్ అయ్యాడు. కానీ వరుస ప్లాపులతో అఖిల్ కనీసం హీరోగా కూడా నిరూపించుకోలేక పోతున్నాడు. ఇందుకు ప్రధాన కారణం నాగార్జుననే అని తెలుస్తోంది.

మాస్ ఇమేజ్ లేదు..

మొదటి నుంచి అక్కినేని హీరోలు అంటే లవర్ బాయ్స్ అనిపించు కున్నారు. కేవలం మన్మథుడు అనే ఇమేజ్ తప్ప వారికి మాస్ ఇమేజ్ మొదటి నుంచి లేదు. కానీ మాస్ ఇమేజ్ లేకపోతే ఏ హీరో కూడా స్టార్ హీరోగా ఎదగలేడు. ఈ విషయాన్ని నాగార్జున మర్చి పోయినట్టు ఉన్నాడు. అఖిల్‌ తో మొదటి సినిమా మాస్ యాంగిల్ లో తీశాడు.

కానీ అది వర్కౌట్ కాకపోవడంతో అన్నీ లవ్‌ స్టోరీలే తీయిస్తున్నాడు. అఖిల్ కు అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెంచాలను కుంటున్నాడు. అదే దెబ్బ కొడుతోంది. ఎందుకంటే మాస్ ఇమేజ్ లేకపోతే ఆయన సినిమాలపై హైప్ రాదు. ఒక రకంగా నాగార్జుననే అఖిల్ కెరీర్ ను మార్చేస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us