Netizens Are Appreciating Sitara Ghattamaneni Help : సితార గొప్ప మనసు.. చిన్న వయసులో పెద్ద సాయం చేసిన మహేశ్ కూతురు..!

NQ Staff - July 16, 2023 / 09:37 AM IST

Netizens Are Appreciating Sitara Ghattamaneni Help : సితార గొప్ప మనసు.. చిన్న వయసులో పెద్ద సాయం చేసిన మహేశ్ కూతురు..!

Netizens Are Appreciating Sitara Ghattamaneni Help :

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఆయన కూతురు సితారకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
క్లాసికల్ డ్యాన్స్, ఇతర యాక్టివిటీస్ తో తాను మల్టీ ట్యాలెంటెడ్ అని నిరూపించుకుంది ఈ భామ.

ఇదిలా ఉండగా రీసెంట్ గా సితార ఓ జ్యువెలరీ యాడ్ చేసింది. పీఎంజే నగల కంపెనీకి ఆమె యాడ్ చేయడం.. ఆమె ఫొటోలను ఏకంగా అమెరికాలో ప్రజెంట్ చేయడం కూడా జరిగాయి. అయితే ఈ యాడ్ ద్వారా సితార ఏకంగా రూ.కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుందంట. ఇది స్టార్ హీరోయిన్ల రేంజ్ అని అంటున్నారు.

సేవా కార్యక్రమం కోసం..

కాగా సితార ఇంత మొత్తంలో తీసుకున్న డబ్బులను ఏం చేసిందనే డౌట్ అందరికీ ఉంది. ఆమె వీటిని ఖర్చు పెట్టుకుండా చారిటీకి ఇచ్చేసిందంట. తన తొలి సంపాదన ఇలా సేవా కార్యక్రమాలకు ఇచ్చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె మంచి మనసుకు అంతా శభాష్‌ అంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us