Rashmi Gautam : అలా చేస్తే నిన్ను చెప్పుతో కొడుతారు.. రష్మీపై నెటిజన్ షాకింగ్ కామెంట్లు..!
NQ Staff - January 16, 2023 / 09:11 AM IST

Rashmi Gautam : యాంకర్ రష్మీ గురించి చెప్పేదేముంది. ఆమె తెలుగు నాట ఇప్పుడు స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది. రష్మీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోయిన్ అవుదామని వచ్చింది. కానీ యాంకర్ గా కెరీర్ను లాగేస్తోంది. జబర్దస్త్ తో మొదలైన ఆమె హవా.. ఇప్పుడు సినిమాల్లో కూడా కొనసాగుతోంది. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతూనే.. అప్పుడప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోతోంది.
కానీ బుల్లితెరపై మాత్రం ఎవర్ గ్రీన్ అనిపించుకుంటోంది. ఇప్పుడు మల్లెమాలకు ఆమె అంకితం అయిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్ గా చేస్తోంది. అయితే కెరీర్ పరంగా సౌమ్యంగా ఉండే రష్మీ.. మూగ జీవాలకు ఏదైనా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోదు.
ఏకిపారేసిన రష్మీ..
ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా మూగ జీవాల హింసపై పోరాటం చేస్తోంది. అయితే సంక్రాంతి సందర్భంగా తాను కోడి పందాలలో గెలిచినట్టు ఓ నెటిజన్ పోస్టు చేశాడు. అది చూసిన రష్మీ అతన్ని ఏకి పారేసింది. “మూగజీవాలను హింసించి మీ పైశాచిక ఆనందం ఏంటి అంటూ అడిగేసింది.
దాంతో మరో నెటిజన్ ఆమెపై రెచ్చిపోయాడు. నీకు దమ్ముంటే జల్లికట్టు మీద మాట్లాడు. తమిళ నాడు వాళ్లు నిన్ను చెప్పుతో కొడుతారు. నీకు లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీపై, తెలుగు ప్రజలపై పడి ఏడవకు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. దాంతో రష్మీ కూడా రెచ్చిపోయింది. నోరు లేని మూగజీవాలపై మీ ప్రతాపమా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
Sad to see people taking pride in such bullshit
Having a harmless festival doesn't take much pic.twitter.com/scoLzi44Sk— rashmi gautam (@rashmigautam27) January 15, 2023