గౌతమ బుద్ధ నేపాల్ కు చెందిన వాడు: నేపాల్

Advertisement

ఇండియా@75 సమ్మిట్-మిషన్ 2022 లో జరిగిన ఇంటర్ ఆక్టివ్ సెక్షన్ లో మాట్లాడుతూ గొప్ప భారతీయుల్లో గౌతమ బుద్ధుడు ఒకరని విదేశాంగ మంత్రి ఎస్ శంకర్ చేసిన వ్యాఖ్యల పై నేపాల్ ప్రభుత్వం ఘాటుగా స్పందించారు. బుద్ధిజంను ప్రపంచానికి చేసిన గౌతమ బుద్ధుడు నేపాల్ కి చెందిన వాడని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదని నేపాల్ స్పోక్స్ పర్సన్ వెల్లడించారు. గౌతమ బుద్ధుడు నేపాల్ కు చెందిన వ్యక్తని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.

అలాగే 2014లో నేపాల్ వెళ్ళిన్నప్పుడు ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా నేపాల్ అధికారులు గుర్తు చేశారు. అప్పుడు మోడీ మాట్లాడుతూ…ప్రశాంతతకు మారుపేరు నేపాల్ అని, ఇక్కడే బుద్ధుడు జన్మించాడని వ్యాఖ్యానించారు. 2013లో విదేశాంగ సెక్రటరీ సుజాత సింగ్ కూడా గౌతమ్ బుద్ధుడు ఇండియన్ అని వ్యాఖ్యానించినప్పుడు కూడా నేపాల్ అధికారులు ఘాటుగా స్పందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here