Nelson DilipKumar An Interesting Comments About Balayya : జైలర్ మూవీలో బాలయ్య ఉండాలి.. కానీ అలా జరిగింది.. డైరెక్టర్ నెల్సన్ కామెంట్లు..!

NQ Staff - August 12, 2023 / 11:29 AM IST

Nelson DilipKumar An Interesting Comments About Balayya : జైలర్ మూవీలో బాలయ్య ఉండాలి.. కానీ అలా జరిగింది.. డైరెక్టర్ నెల్సన్ కామెంట్లు..!

Nelson DilipKumar An Interesting Comments About Balayya :

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమాతో వచ్చాడు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ రజినీని ఎలా చూడాలనుకున్నారో.. ఇందులో ఆయన అలాగే ఉన్నారు. అయితే రజినీకాంత్ ఇందులో రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్రలో అదరగొట్టేశారు.

పైగా ఇందులో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు కూడా యాక్ట్ చేయడంతో విపరీతంగా కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో మూవీ డైరెక్టర్ నెల్సన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీని మల్టీ స్టారర్ గా తీయాలని అనుకోలేదు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లను కేవలం అట్రాక్షన్ కోసమే పెట్టుకున్నాం.

అనుకున్నట్టు రాలేదు..

వాస్తవానికి ఈ సినిమాలో బాలయ్య బాబు కూడా నటించాలని అనుకున్నా. అందుకోసం ఓ పాత్రను కూడా రాసుకున్నా. ఆయన్ను దృష్టిలో ఉంచుకుని ఆయన ఇమేజ్ కు తగ్గట్టు దాన్ని డిజైన్ చేయాలని అనుకున్నా. కానీ ఆ పాత్ర అనుకున్నంత సరిగ్గా రాలేదు. అందుకే ఆ పాత్రలో బాలయ్య నటించడం కరెక్ట్ కాదని విరమించు కున్నాను.

లేదంటే ఆయన ఇందులో కనిపించేవారు. ఒకవేళ భవిష్యత్ లో ఆయనతో సినిమా తీస్తానేమో అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. చాలా కాలం తర్వాత ఆయనకు ఈ సినిమాతో ఓ మంచి హిట్ దక్కింది. ఈ మూవీ రజినీకి మంచి బూస్ట్ ఇస్తుందనే చెప్పుకోవాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us