రండి రండి మీకు స్వాగతం : చంద్రబాబు NDA లోకి

nda inviting chandrababu to make alliance of tdp
nda inviting chandrababu to make alliance of tdp

టీడీపీ.. ప్రస్తుతం ఎటూ లేకుండా పోయింది. అప్పుడు ఎన్డీఏతో పొత్తు అలాగే ఉంచుకున్నా బాగుండు. ఇప్పుడు చంద్రబాబుకు ఆ పొత్తు ఎంతో ఉపయోగపడేది. అటు పొత్తు పాయే.. అధికారం పాయే.. అన్నీ పోయి ఒంటరిగా అయిపోయారు చంద్రబాబు. సరె.. సర్లే.. ఎన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా? ఏంటి.. పాత గొడవలు పక్కన పెట్టి.. ఇప్పటికైనా చంద్రబాబు బీజేపీతో దోస్తీ కట్టాల్సిందే. లేదంటే భవిష్యత్తులో చంద్రబాబుకు మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

పార్టీ పరంగా, రాజకీయ పరంగా చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే.. బీజేపీ విషయంలో మాత్రం చంద్రబాబు సానుకూలంగానే ఉండాలి. అధికార పార్టీని ఎదుర్కొవాలంటే చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న బలం సరిపోదు. టీడీపీ నేతలు సరిపోరు. అందుకే… బీజేపీతో కలిసి పోరాడగలిగితే… వైసీపీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు.

టీడీపీ సీనియర్ నేతలు కూడా అదే విషయాన్ని చంద్రబాబుకు పదే పదే గుర్తు చేస్తున్నారు. సీఎం జగన్ ను నిలువరించాలన్నా.. వైసీపీని ఇరుకున పెట్టాలన్నా.. అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని… అందుకే… బీజేపీ విషయంలో వివాదాలకు పోకుండా సానుకూలంగా ఉండాలని.. అప్పుడే వైసీపీని ఇబ్బంది పెట్టొచ్చని చెబుతున్నారట.

కానీ.. చంద్రబాబు ఏదో పైకి బీజేపీతో సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. బీజేపీ కూడా పొత్తు కోసం చంద్రబాబును అడిగేందుకు ప్రయత్నిస్తున్నా.. చంద్రబాబు మాత్రం ఎందుకో ఈ విషయంలో పెద్దగా స్పందించడం లేదు. ఇప్పుడే పొత్తుల గురించి వద్దని.. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున… పొత్తు గురించి అప్పుడు ఆలోచిస్తే బెటర్ అని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నందున.. టీడీపీకి కేంద్రం నుంచి కూడా సహకారం అంతగా అందడం లేదని ప్రచారం జరుగుతోంది. కేంద్రం నుంచి ఎలాగూ సీఎం జగన్ కు సరైన మద్దతు లభించడం లేదు. నిధులు కూడా రాష్ట్రానికి సరిగ్గా రావట్లేదు. కేంద్రం దగ్గర పెద్దగా జగన్ వ్యవహారం నడవడం లేదు. దీన్ని ఆసరా చేసుకొని చంద్రబాబు కేంద్రం నుంచి నిధులను రాష్ట్రానికి విడుదల చేయగలిగితే.. రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో బీజేపీతో కలిసి నడిస్తే… సీఎం జగన్ ను ఇరుకున పెట్టొచ్చు.. అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా.. బీజేపీతో మరోసారి కలిసి నడిచేందుకు మాత్రం చంద్రబాబు ఆచీతూచీ అడుగులేస్తున్నారు.

Advertisement