రీయా ఇంట్లో సోదాలు చేస్తున్న ఎన్‌సీబీ అధికారులు

Advertisement

జులై 14న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సుశాంత్ మృతి చెందిన తరువాత దీనిపై పలురకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి సుశాంత్ మృతి వెనక ఉన్న నిజాలను బయటకు తీయడానికి సుప్రీం కోర్ట్ సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో ఈ విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేసేదంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఇంట్లో మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) సోదాలు చేపట్టింది. డ్రగ్‌ డీలర్‌ జైద్‌ విలాత్రకు రియాతోపాటు ఆమె తమ్ముడు షోవిక్‌కు సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ముంబయిలోని నటి ఇంటికి చేరుకున్న ఎన్‌సీబీ బృందం ఆకస్మిక సోదాలు చేపడుతోంది.

సుశాంత్ మృతి వెనక బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉందని నటి కంగనా రనౌత్ మొదటి నుండి ఆరోపణలు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఈ మృతి తరువాత బాలీవుడ్ లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నెపోటిజం వల్ల నటీనటులు అయిన వారి మూవీస్ ను హిందీ ప్రేక్షకులు చూడటానికి కూడా ఇష్ట పడటం లేదు. సుశాంత్ మృతి వెనక ఉన్న అసలు నిజాలను సీబీఐ అధికారులు త్వరలోనే బయటపెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here