Balakrishna : బాలయ్య బర్త్‌డే కి డబుల్ ధమాకా.. ఫ్యాన్స్ కి పిచెక్కడం ఖాయం
NQ Staff - June 7, 2023 / 08:56 PM IST

Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా యొక్క టైటిల్ ను రేపు రివీల్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు యూనిట్ సభ్యులు టైటిల్ విషయంలో లీక్ రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
జూన్ 8వ తారీకున టైటిల్ ను రివీల్ చేయబోతున్న యూనిట్ సభ్యులు బర్త్ డే సందర్భంగా జూన్ 10న భారీ ఎత్తున టీజర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీజర్ లేదా టైటిల్ పోస్టర్ లో సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. బాలయ్య యొక్క సరికొత్త గెటప్ ను ఈ సినిమా లో చూడబోతున్న విషయం తెల్సిందే.
ఇక బాలయ్య యొక్క తదుపరి సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ప్రకటించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా యొక్క అధికారిక ప్రకటన త్వరలో రాబోతుంది అంటూ అభిమానులు గత కొన్నాళ్లుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు బర్త్ డే సందర్భంగా రాబోతుంది అంటూ క్లారిటీ వచ్చింది.
ఇంకా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా పలు కీలక అప్డేట్స్ వస్తాయని.. ముఖ్యంగా భగవత్ కేసరి సినిమా డబుల్ ధమాకా ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబో మూవీ ఒక వైపు ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తూనే మరో వైపు ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ను అందించబోతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.