South Industry : సౌత్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోయిన్ ఆమెనే.. ఎవరూ ఊహించలేరు..!
NQ Staff - June 12, 2023 / 11:45 AM IST

South Industry : ఇప్పుడు హీరోయిన్ల సంపాదన కూడా వందల కోట్లకు చేరుకుంటోంది. కాస్త క్రేజ్ వస్తే చాలు.. ఒకేసారి నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పేస్తున్నారు. ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలోపు మరో నాలుగైదు సినిమాలకు డేట్స్ ఇచ్చేసి బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇదే నడుస్తోంది.
అయితే సౌత్ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే హీరోయిన్లు హీరోల కంటే తక్కువగాన సంపాదిస్తున్నారు. ఈక్రమంలోనే అసలు సౌత్ ఇండస్ట్రీలో ఎవరు నెంబర్ వన్ రిచెస్ట్ హీరోయిన్ అని ఆరా తీయగా.. నయనతార అని తేలింది. అవును రెండు దశాబ్దాలకు పైగా సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

Nayanthara Getting High Remuneration In South Industry
ఈ కారణంగానే ఆమెనే మిగతా హీరోయిన్ల కంటే అత్యధిక ధనవంతురాలు అయిపోయింది. ఆమె ఆస్తి విలువ దాదాపు రూ.165 కోట్లు అని తెలుస్తోంది. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు తీసుకుంటోంది. ఆమె తర్వాత స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఉంది. ఆమె ఆస్తి విలువ రూ.110 కోట్లు.
ఇక రూ.105 కోట్లతో మూడో స్థానంలో అనుష్కశెట్టి నిలిచింది. ఆ తర్వాత రూ.90 కోట్లతో సమంత ఉన్నది. ఆమె తర్వాత స్థానంలో కాజల్, రష్మిక లాంటి వారు ఉన్నారు. ఇక ప్రస్తుతం రష్మిక చాలా పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కాబట్టి ఆమె భవిష్యత్ లో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది.