Nayanathara: న‌య‌న్‌ని ప్రేమ‌గా హ‌త్తుకున్న విఘ్నేష్ శివ‌న్.. మురిసిపోయిన స‌మంత‌

Nayanathara: లేడీ సూపర్‌స్టార్‌ అంటూ ఫ్యాన్స్‌తో నీరాజనాలు అందుకుంటున్న స్టార్‌ హీరోయిన్‌ నయనతార ఈ రోజు (నవంబరు18) 37వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. అర్ధ‌రాత్రి నుండే ఈ అమ్మ‌డి బ‌ర్త్ డే సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు కాబోయే భర్త , దర్శకుడు విఘ్నేష్ శివన్ నయన్‌ పుట్టిన రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు. స్పెషల్‌ పార్టీతో తన లేడీ లవ్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. బాణాసంచా ఆకాశమంతా వెలిగిపోయింది.

TheNewsQube-
nayanathara brthday celebrations
nayanathara brthday celebrations

బుధవారం అర్ధరాత్రే కేక్‌ కటింగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాడు. ఈ వేడుకకు సమంత కూడా హాజరైంది. కాగా నయన్‌ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలవురు ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌ ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఇటు సెలెబ్రిటీస్‌తో పాటు అటు అభిమానులు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.  Photo : Twitter

విఘ్నేష్‌ దర్శకత్వంలో నయనతార, సమంత, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’. కాగా నయన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలో ఆమె పోషించిన ‘కణ్మణి’ పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిని ఇన్‌స్టాలో పంచుకుని తన ప్రియురాలికి బర్త్‌డే విషెస్ చెప్పుకొచ్చాడు విఘ్నేష్‌.

‘ కణ్మణి, తంగమేయి నా ఎల్లమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ ప్రేమ, ఆప్యాయతలతో నా జీవితం పరిపూర్ణమైంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే అందంగా, ఆనందంగా ఉండేలా ఆ భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని ప్రియురాలిపై ప్రేమను కురిపించాడు విఘ్నేష్‌.

 లేడీ సూపర్ స్టార్ నయనతార తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. Photo : Twitter

ఇక నయన్‌ బర్త్‌ డే వేడుకలు కూడా గ్రాండ్‌గా జరిగాయి. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసేముందు తన ప్రియుడిని ఆప్యాయంగా హత్తుకుందీ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.