Nayanthara Assets Value : నయనతార ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
NQ Staff - July 9, 2023 / 07:06 PM IST

Nayanthara Assets Value :
నయనతార గురించి స్పెషల్ పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి.. లేడీ సూపర్ స్టార్ గా ఈమె ప్రేక్షకుల చేత పిలిపించు కుంటుంది.. ఈ పేరుతోనే అర్ధం అవుతుంది ఈమె ఎంత ఎత్తుకు ఎదిగిందో.. నయనతార ముందు నుండి నటన పరంగా అద్భుతమైన అభినయాన్ని కనబరుస్తుంది.
ఏ పాత్రలో అయిన ఈమె చేస్తే ఆమె నటనకు వంకలు పెట్టడానికి కూడా ఉండదు.. ఆ పాత్రలో జీవించి ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది. అందుకే ఈమెకు అంత డిమాండ్.. నాలుగు పదుల వయసుకు చేరువవుతున్న ఈమె అందం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.. ప్రజెంట్ సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటు దూసుకు పోతుంది.
2003లో కెరీర్ స్టార్ట్ చేసిన నయనతార ఆ తర్వాత చంద్రముఖి, గజనీ లాంటి సినిమాలు కోలీవుడ్ లో బ్రేక్ ఇచ్చాయి. వీటితో తెలుగులో కూడా దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తుంది. మరి ఈ భామ ఆస్తుల వివరాలు మైండ్ బ్లాంక్ చేసేస్తున్నాయి.. అధికారికంగా ఆదాయ పన్ను శాఖ వారు అందించిన వివరాల ప్రకారం ఈమెకు భారీగానే ఆస్తులు ఉన్నాయి.
ఇప్పటికే 75కు పైగానే సినిమాల్లో నటించిన ఈమె ఒక్కో సినిమాకు 5 నుండి 10 కోట్లు తీసుకుంటుంది.. అంత డిమాండ్ చేస్తున్న అమ్మడికి నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చి మరీ ఒప్పిస్తున్నారు. ఈ 20 ఏళ్లలో ఈ భామ దాదాపు 200 కోట్ల ఖరీదైన ఆస్తులను కూడబెట్టినట్టు అధికారికంగా సమాచారం అందించారట.
ఈమె ఒక్కో ఫ్లాట్ ధర 20 కోట్లు ఉంటుందట. అలా బంజారాహిల్స్ లో రెండు ఉన్నాయట.. ఇక చెన్నై లో ఒక బంగ్లా కేరళలో ఖరీదైన ఇల్లు, చెన్నైలో పురాతన థియేటర్ ను కూడా ఈమె కొనుగోలు చేశారట.. లగ్జరీ కారుతో పాటు ప్రైవేట్ జెట్ విమానం ఉందట.. మరి అధికారికంగానే మొత్తంగా 200 కోట్లు ఉంటే అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటాయని అంటున్నారు.