Nayanthara And Vignesh Shivan Embroiled In Controversy : నయనతార-విఘ్నేష్ మా ఆస్తిని కాజేశారు.. ఫిర్యాదు చేసిన సొంత కుటుంబీకులు..!

NQ Staff - July 8, 2023 / 09:52 AM IST

Nayanthara And Vignesh Shivan Embroiled In Controversy : నయనతార-విఘ్నేష్ మా ఆస్తిని కాజేశారు.. ఫిర్యాదు చేసిన సొంత కుటుంబీకులు..!

Nayanthara And Vignesh Shivan Embroiled In Controversy  :

నయనతార-విఘ్నేష్ లు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. వారిద్దరూ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిద్దరూ తమ ఆస్తిని కాజేశారంటూ సొంత కుటుంబీకులే కేసు పెట్టారు. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. విగ్నేష్ శివన్ తండ్రి శివ కొళుదు తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్ కుడి గ్రామానికి చెందిన వ్యక్తి.

అయితే శివ కొళుదుకు ఎనిమిది మంది అన్నదమ్ములు ఉన్నారు. ఆయన గతంలో పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసేవాడు. కాగా తన అన్నదమ్ములకు చెందిన ఆస్తిని గతంలో శివ కొళుదు వేరే వ్యక్తికి అమ్మేశాడంట. ఉమ్మడి ఆస్తిని అమ్ముకుని తమకు అన్యాయం చేశాడని విఘ్నేష్ శివన్ బాబాయ్ లు ఆరోపిస్తున్నారు.

డీజీపీ ఆఫీసులో కేసు..

ఆస్తిని కొన్న వ్యక్తికి డబ్బులు చెల్లించి తమ ఆస్తిని తమకు ఇప్పించాలని విఘ్నేష్ శివన్ బాబాయ్ లు మాణిక్యం, కుంచిత పాదంలు తిరుచ్చిలోని డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో నయనతార-విఘ్నేష్ శివన్, ఆయన తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యల పేర్లు కూడా చేర్చారు.

డీజీపీ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. పెళ్లి అయినప్పటి నుంచి వీరిద్దరూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. కాగా ఈ కేసు విషయం తెలిసి కొందరు.. వీరిని విమర్శిస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us