SALAAR దాదాపు ఐదేళ్ళ పాటు బాహుబలి సినిమా కోసం కాల్షీట్స్ కేటాయించిన ప్రభాస్ ఆ తర్వాత సాహో అనే చిత్రాన్ని చేశాడు. ఈ మూవీ తర్వాత రాధే శ్యామ్ చేస్తున్నట్టు ప్రకటించిన డార్లింగ్ వెంటవెంటనే మూడు ప్రాజెక్ట్‌లని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, సమ్మర్లో మూవీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం సలార్ అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీతో పాటు ఆదిపురుష్ అనే చిత్రాన్ని చేయనున్నాడు. ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. మరి కొద్ది రోజుల తర్వాత నాగ్ అశ్విన్ పీరియాడికల్ మూవీని మొదలు పెట్టనున్నాడు. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే కాగా, ఈ సినిమాల పై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కె.జి.యఫ్’ దర్శక నిర్మాతలు ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్ రూపొందిస్తున్న సలార్ చిత్రం ప్రస్తుతం గోదావరి ఖనిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారు. తాజాగా ప్రభాస్ లుక్కు సంబంధించి పలు ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. ఇవి అభిమానులని ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ చిత్రాన్ని ముందుగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కెజిఎఫ్) లో షూట్ చేయాలని ప్రణాళిక వేసింది సలార్ బృందం. కాని గోదావరిఖని బొగ్గు గనులు మరియు దాని పరిసరాలు, కాలేశ్వరం ప్రాజెక్ట్, పెద్దపల్లి సింగరేని బొగ్గు గనులు ఈ చిత్ర బృందాన్ని మంత్రముగ్దులను చేసింది . దీంతో వారు రామగుండంలో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే ప్రస్తుతం సలార్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి నక్సల్స్ బెడద ఎక్కువ. అలానే సామాజిక వ్యతిరేఖ శక్తుల తాకిడి కూడా ఎక్కవగానే ఉంటుందట. దీంతో ప్రభాస్ రామగుండంకు రాగానే అక్కడి పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణతో సమావేశమయ్యారు. భద్రత కల్పించాలని కోరారు. ప్రభాస్ కోరిక మేరకు లొకేషన్లో 40 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో హీరోయిన్గా శ్రుతి హాసన్ నటిస్తుంది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ కింగ్‌మేకర్‌గా కనిపిస్తాడని టాక్. నాలుగు నెలల పాటు ఈ మూవీ షూటింగ్లో ప్రభాస్ పాల్గొననున్నాడని సమాచారం.