Farming: లాక్‌డౌన్ వేళ పార ప‌ట్టి వ్య‌వ‌సాయం చేస్తున్న స్టార్ న‌టుడు

Farming: మ‌నం ఎంత ఎదిగినా కూడా వృత్తిని, ప్ర‌వృత్తిని మ‌రిచిపోకూడ‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ముఖ్యంగా వ్య‌వ‌సాయాన్నిఅస్స‌లు మ‌ర‌వొద్దు. ఇప్పుడు రైతులే దేశానికి వెన్న‌ముక‌. అలాంటి రైత‌న్ని కాపాడుకుంటూ వీలున్న‌ప్పుడ‌ల్లా మ‌నం వ్య‌వ‌సాయం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి చిత్రంలో వీకెండ్ వ్య‌వ‌సాయం అనే కొత్త పాయింట్‌ని లేవ‌నెత్తి ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తెచ్చారు.

Farming

ఇక కరోనా వ‌ల‌న కొంద‌రు స్టార్స్ కూడా ఫాం హౌజ్‌ల‌కు వెళ్లి వ్య‌వ‌సాయం చేసుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌కాశ్ రాజ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌కి మ‌ట్టి వాస‌నంటే చాలా ఇష్టం. వారు మ‌ట్టి మ‌నుషులుగా మారేందుకు ఏ మాత్రం ఆలోచించ‌రు. ఇప్పుడు బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ కూడా రైతుగా మారి వ్య‌వ‌సాయం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని బుదానాలో నవాజ్ సిద్ధికీ కుటుంబానికి వ్యవసాయ భూములు ఉన్నాయి. రైతు కుటుంబం నుంచి వచ్చిన నవాజ్ కు.. వ్యవసాయం చేయడం కూడా పూర్తిగా తెలుసు. అందుకే.. లాక్ డౌన్ వేళ ఆయన అసలైన రైతుగా మారి విత్త‌నాలు కూడా వేశారు.

గ‌త ఏడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో స్వ‌స్థ‌లానికి వెళ్లిన నవాజుద్దీన్ అక్క‌డ పొలం ప‌నులు చేశారు. లాక్‌డౌన్ త‌ర్వాత ముంబై వ‌చ్చిన ఆయ‌న షూటింగ్స్‌లో పాల్గొన్నారు. ఇకీ ఏడాది మ‌రో సారి లాక్ డౌన్ విధించడంతో సొంతూరికి వెళ్లారు. ప్రస్తుతం తన గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేయాలని భావిస్తున్నానని చెబుతున్న న‌వాజుద్దీన్ పంటలు పూర్తయిన తర్వాతే తిరిగి ముంబైలో అడుగు పెడతానని చెబుతున్నాడు.

Farming

షూటింగ్స్ మొద‌లైన‌ప్ప‌టికీ ముందు వ్య‌వ‌సాయ ప‌నులు పూర్తి చేసి ఆ త‌ర్వాత మేక‌ప్ వేసుకుంటానంటున్నాడు న‌వాజుద్దీన్. ఈయ‌న బాలీవుడ్ లో భారీ పారితోషికం అందుకునే నటులలో ఒక‌రిగా ఉంటారు. ఒక్కో సినిమాకు కనీసం 5 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటాడు . అలాంటి ఈన‌టుడు ఒక్క రూపాయి పారితోషికం అందుకున్నారు. ఆ వార్త రీసెంట్‌గా తెగ ప్ర‌చారం జరుపుకుంది.

Farming

ప్రముఖ ఉర్ధూ రచయిత సాదత్ హాసన్ మాంటో జీవితం ఆధారంగా సినిమా రాగా, ఈ సినిమాను నందితా దాస్ తెరకెక్కించింది. మాంటో సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా కోసం అందరూ ఫ్రీగానే నటించారు. ఒక్కరు కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు. కథ నచ్చి.. అలాగే మాంటోకు గౌరవం ఇచ్చి అంతా ఉచితంగానే నటించారు. కాని న‌వాజుద్దీన్ మాత్రం రూపాయి తీసుకున్నారు. ఈ సినిమాతో తన ఆలోచనలను, ఆశయాలను వ్యక్తీకరించాలనుకున్నాడు నవాజుద్ధీన్. అందుకే ఈ సినిమా కోసం రూపాయి తీసుకున్నట్లు చెప్పాడు సిద్ధిఖీ