‘V’ ఓటీటీ రిలీజ్ అవుతున్న కారణంగా నాని ఎమోషనల్ లెటర్

Advertisement

హీరో నాని, సుధీర్ కలిసిన నటించిన ‘V’ చిత్రం వచ్చే నెల 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుందని మూవీయూనిట్ ప్రకటించింది. ఈ మూవీని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించగా, దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ నానికి చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఈ మూవీ నాని యొక్క 25 మూవీ. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అవుతున్న కారణంగా నాని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎమోషనల్ లెటర్ రాశారు.

“ఈ మూవీ నాకు చాలా కారణాల వల్ల చాలా స్పెషల్. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన్నప్పటి నుండి అంటే గత 12 సంవత్సరాలగా నన్ను చూడటానికి మీరు థియేటర్ కు వచ్చారు కానీ ఈ సారి నా 25 మూవీ ‘V’ తో మీ ఇండ్లను వస్తున్నాను. వచ్చి మీ అందరిని అలరిస్తాను. కరోనా వల్ల ఇప్పుడు మీ ఇంటికి నేను వస్తున్నా కానీ ఒక్కసారి ఈ ప్రాబ్లెమ్స్ తొలగిపోతే టక్ జగదీష్ తో మిమ్మల్ని థియేటర్స్ లో అలరిస్తా” అని లెటర్ లో పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here