Natti Kumar Vs RGV : ఆర్జీవీకీ, నట్టికుమార్‌కీ వైసీపీ అధిష్టానం ‘క్లాస్’.!
NQ Staff - June 11, 2022 / 08:51 PM IST

Natti Kumar Vs RGV : సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనుకోవడానికి వీల్లేదు. అంతా కలగలిసిపోయాయ్.! వివాదాల రామ్ గోపాల్ వర్మకి, రాజకీయాలతో ఏం సంబంధం.? ఇంకో వివాదాల నిర్మాత నట్టికుమార్‌కి రాజకీయాలతో ఏం సంబంధం.? నిజానికి, ఇద్దరూ రాజకీయాలతో టచ్‌లోనే వున్నారు. రామ్ గోపాల్ వర్మ వెనుకాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వుంది. సేమ్ టు సేమ్, నట్టి కుమార్ వెనుక కూడా వైఎస్సార్సీపీనే వుంది.
వైసీపీ మీద ఈగ వాలనివ్వరు ఈ ఇద్దరు సినీ ప్రముఖులు. చిత్రంగా ఈ ఇద్దరి మధ్యా గొడవ వచ్చింది. కేసులు పెట్టుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. బస్తీ మే సవాల్ అన్నారు. చివరికి కలిసిపోయారు. ఈ సందర్భంగా ‘రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ శాశ్వత శతృవులు వుండరు..’ అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
నట్లూ, బోల్టులూ.!
అంటే, మధ్యలో వెర్రి వెంగళప్పలుగా మారింది మీడియా, పోలీస్ వ్యవస్థ అలాగే న్యాయ వ్యస్థ అనుకోవాలా.? అన్నది నెటిజనం ప్రశ్న. నిజమే మరి, కోర్టు మెట్లెక్కి నానా యాగీ చేసేసి, చివరికి అంతా తూచ్ అనేస్తే ఇలాగే వుంటుంది మరి.
ఇద్దరూ వైసీపీ మద్దతుదారులే గనుక, వైసీపీ అధిష్టానం గుస్సా అయ్యిందనీ, ఈ క్రమంలోనే ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారనీ నెటిజన్లు, ఆర్జీవీకి కౌంటర్ ఎటాక్ ఇస్తూ వస్తున్నారు.

Natti Kumar Vs RGV
కథ, కాకరకాయ్ అవసరం లేదు.. వైసీపీ అధిష్టానం ఏదన్నా పాయింట్ ఇస్తే చాలు, దాని మీద వర్మ సినిమాలు తీసేస్తుంటాడన్న వాదన ఈనాటిది కాదు. వర్మ ఎప్పుడో మంచి సినిమాలు తీయడం మానేశాడు. అసలు సినిమాలు తీయడమే మానేశాడు. తీస్తున్నదల్లా వైసీపీకి అవసరమైన పొలిటికల్ ఫుటేజ్.. నట్టికుమార్ విషయంలోనూ దాదాపు ఇదే విమర్శ వుంది.