Natraj: తండ్రైన న‌ట‌రాజ్ మాస్ట‌ర్.. అనుకున్నదే జ‌రిగింద‌ని ఎమోష‌న‌ల్‌

Natraj: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 నుంచి ఎలిమినేట్ అయినా కూడా క్రేజ్ ద‌క్కించుకున్న వారిలో డాన్స్ మాస్ట‌ర్ న‌ట‌రాజ్ ఒక‌రు. ఆయ‌న డాన్స్ మాస్ట‌ర్‌గా ఎంత మందికి పెద్ద‌గా తెలుసో లేదో కానీ.. బిగ్‌బాస్‌లో పాల్గొన‌డం.. ఆయ‌న అక్క‌డ ఎమోష‌న‌ల్ కావ‌డం ఇవన్నీ ఆయ‌న‌కు జ‌నాల్లో క్రేజ్‌ను తీసుకొచ్చింద‌న‌డంలో సందేహం లేదు.

TheNewsQube-
natraj got fatherpromotion
natraj got fatherpromotion

ఇప్పుడు అదే క్రేజ్ తో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి వ‌ర్క్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. నంద‌మూరి బాల‌కృష్ణ ‘అన్‌స్టాప‌బుల్‌’ అనే టాక్‌షో కోసం బాల‌య్య ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి అక్క‌డున్న డాన్స‌ర్స్‌తో క‌లిసి స్టెప్పులేస్తారు. దీనికి సంబంధించిన కొరియోగ్ర‌ఫీని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల వీడియో విడుద‌ల కాగా దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక బిగ్ బాస్ షోకు వెళ్లేముందు నటరాజ్ మాస్టర్ స్టేజ్ మీదే ఎమోషనల్ అయ్యాడు. తన భార్య ఏడో నెలతో ఉందని, బిగ్ బాస్ షోకు వెళ్లాలా? వద్దా? అని కూడా బాగా ఆలోచించానని నటరాజ్ మాస్టర్ అన్నాడు. అయితే పుట్టబోయే బిడ్డను నా చేతుల్తో ఎత్తుకుంటానో లేదో అని బాధపడ్డాడు. ఇంట్లో ఉన్న సమయంలోనూ భార్య గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

అయితే నటరాజ్ మాస్టర్ కన్న కలలు, కోరికలు నెరవేరాయి. పండంటి బిడ్డ పుట్టిందంటూ నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. అమ్మాయి పుట్టాలని నేను కోరుకున్నాను.. అబ్బాయి పుట్టాలని మా ఆవిడ కోరుకుంది.. ఎవరు పుట్టినా మాకు ఓకే అంటూ నటరాజ్ మాస్టర్ అన్నాడు. అయితే నటరాజ్ మాస్టర్ కోరిక మేరకు ఆడపిల్లే పుట్టింది. ఇక దీంతో నటరాజ్ మాస్టర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

natraj got fatherpromotion.1jpg
natraj got fatherpromotion.1jpg

ఆయ‌న భార్య ఏడు నెల‌ల గ‌ర్బిణిగా ఉన్నప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆయ‌న ఎంట్రీ ఇచ్చాడు. అయితే నాలుగోవారం ఆయ‌నకు ఓట్లు త‌క్కువ‌గా రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. వ‌స్తే వ‌చ్చాడు కానీ.. ఇప్పుడు సెల‌బ్రిటీ కావ‌డంతో న‌ట‌రాజ్‌కు మంచి గుర్తింపే ద‌క్కుతుంది. చిన్న డాన్స‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌కు ఈ సెల‌బ్రిటీ హోదా రావ‌డంపై చాలాసార్లు త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసుకున్నాడు.