Viral News : తనని పట్టించుకోని పిల్లలకు షాక్ ఇచ్చిన వృద్ధ తండ్రి.. రూ.1.5 కోట్ల ఆస్తి ఏం చేశాడో తెలుసా?
NQ Staff - March 6, 2023 / 08:07 PM IST

Viral News : పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధులైన తర్వాత పిల్లలు పట్టించుకోకుండా తమ తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. డబ్బు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులను పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్తు ఇచ్చిన తల్లిదండ్రులను పట్టించుకోకుండా అనాధాశ్రమంలో వదిలేస్తున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు.
తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ముజఫర్ నగరానికి చెందిన 85 ఏళ్ల నాదు సింగ్ తన అయిదుగురు పిల్లలు పట్టించుకోవడం లేదంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన పిల్లలు పట్టించుకోకుండా అనాధాశ్రమంలో వదిలేయడంతో తాను వారిని వదిలేసినట్లుగా ప్రకటించాడు.
తన పేరిట ఉన్న 1.5 కోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వానికి రాసి ఇచ్చాడు. అంతే కాకుండా తాను చనిపోయిన తర్వాత తన శవాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని కూడా అధికారులకు విజ్ఞప్తి చేశాడు. తన అంత్యక్రియలకు నలుగురు కుమార్తెలను మరియు కుమారుడిని అనుమతించ వద్దని కూడా నాదూ సింగ్ విజ్ఞప్తి చేశాడు.
కొడుకు మరియు కుమార్తెలు తనని పట్టించుకోక పోవడంతో కలత చెందిన నాదూ సింగ్ తన ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసి ఇచ్చి చావు కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.