NASA: ఇదెక్క‌డి విచిత్రం.. మ‌ట్టి ఖ‌రీదు ఆరున్న‌ర ల‌క్షల కోట్లా..!

NASA: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా ఎప్పుడు అద్భుతాల‌ను సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటుంది. ఇందుకోసం భారీగానే ఖ‌ర్చ చేస్తుంటుంది. కొన్నాళ్లుగా అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు చేస్తూ వ‌స్తున్న నాసా తాజాగా మార్స్ మీద నుండి మ‌ట్టి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది. భూమ్మీద ఏనాడూ సంభవించని ఓ బృహత్కార్యానికి నాసా శ్రీకారం చుట్టగా, దీనిపై అంత‌టా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

NASA

మనకు అత్యంత సమీపంలో ఉన్న అంగారకుడి నుంచి ఓ కేజీ మట్టిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌గా, ఈ ప్రాజెక్ట్ కోసం 9 బిలియన్ల డాలర్లు(అక్షరాలా ఆరున్న‌ర‌ లక్షల కోట్ల రూపాయ‌లు) ఖ‌ర్చు చేస్తుంద‌ట‌. ఒకవేళ అదే జరిగితే ఆ మట్టే భూమ్మీద అత్యంత ఖ‌రీదైన‌ వస్తువుగా మారుతుంది. అయితే నాసా దాదాపు రెండు పౌండ్ల మట్టి(దాదాపు కేజీ)ని మట్టిని మార్స్​ నుంచి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు దశలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది.

NASA

మ‌ట్టి శాంపిల్ సేక‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తి కావ‌డానికి రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టేలా ఉంద‌ని నాసా అంటుంది. దానిని భూమికి తీసుకు రావ‌డానికి మ‌రో పదేళ్ల స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ట‌. ఖ‌రీదుతో పాటు స‌మ‌యం కూడా ఎక్కువ తీసుకుంటున్న‌ప్ప‌టికీ నాసా మాత్రం అంగార‌కుడి ద‌గ్గ‌ర నుండి మ‌ట్టిని తెప్పించే ప్ర‌య‌త్నాల‌లోనే ఉంద‌ట‌. కొంద‌రు నాసా ప్ర‌య‌త్నాల‌ని అభినందిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసిన నాసా మాత్రం వారు అనుకున్న దిశ‌గా ముందుకు సాగుతుంది. చూడాలి మ‌రి ఈ ప్ర‌య‌త్నంలో నాసా ఎంత వ‌ర‌కు విజ‌యం సాధిస్తుందో..!