Naresh And Pavitra Lokesh : నరేష్, పవిత్ర.! ఓ ‘ప్రేమ’ కథ.!

NQ Staff - November 19, 2022 / 05:50 PM IST

Naresh And Pavitra Lokesh : నరేష్, పవిత్ర.! ఓ ‘ప్రేమ’ కథ.!

Naresh And Pavitra Lokesh : ఆమెకు ఇదివరకే పెళ్ళయ్యింది. అతనికీ పెళ్ళయ్యింది. పెళ్ళి కాదు.. పెళిళ్ళు అయ్యాయి ఇరువురికీ.! కానీ, వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంకోసారి పెళ్ళి చేసుకోబోతున్నారట. వాళ్ళిద్దరూ ఎవరో కాదు సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్.!

సహజీవనం నేరం కాదని న్యాయస్థానాలే చెబుతున్నాయ్. సో, నరేష్ – పవిత్ర లోకేష్ గనుక సహజీవనం చేస్తోంటే.. వాళ్ళని తప్పు పట్టడానికేమీ లేదు.

కృష్ణ మరణానంతరం మరింత రచ్చ..

సూపర్ స్టార్ కృష్ణ‌కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఇందిర కొన్ని నెలల క్రితమే కన్నుమూశారు. రెండో భార్య విజయనిర్మల కొన్నాళ్ళ క్రితమే పరమపదించారు. కృష్ణ ఈ మధ్యనే తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విజయనిర్మలకు మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం నరేష్.

కేవలం సినీ రంగంలోనే ఇలాంటి సంబంధాలు వుంటున్నాయా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. నరేష్ – పవిత్ర కలిసి కృష్ణ ఆసుపత్రిలో వున్నప్పుడూ, ఆయన మరణం తర్వాతా చేసిన హంగామా నేపథ్యంలో ఈ ఇద్దరూ ఇంకోసారి వార్తల్లో వ్యక్తులుగా మారారు.

ఆ ‘స్కోప్’ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. బహుశా ఈ రెండు ప్రేమపక్షులూ పబ్లిసిటీ కూడా కోరుకుంటున్నాయేమో.! ముదురు వయసులో ప్రేమేంటి.. అనొద్దు.. ప్రేమకు వయసుతో పనేముంది.?

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us