Nara Lokesh : ఏడాది పాటు ఇంటికి రానని బ్రహ్మణి కి చెప్పాను : లోకేష్
NQ Staff - January 23, 2023 / 10:38 PM IST

Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తారీఖున చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే.
4000 కిలోమీటర్లను 400 రోజుల పాటు నడవబోతున్నాడు. ఇటీవలే ప్రభుత్వం నుండి లోకేష్ యొక్క పాదయాత్రకు అనుమతులు లభించాయి. పాద యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
మరి కొన్ని రోజుల్లో పాదయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నారా లోకేష్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన ఆరోగ్య సంబంధిత జాగ్రత్తలు తీసుకుంటూనే, మరో వైపు కుటుంబంతో సాధ్యమైనంత ఎక్కువగా గడుపుతున్నారు.
తాజాగా నారా లోకేష్ మాట్లాడుతూ.. సంవత్సర కాలం పాటు తాను ఇంటికి రానని బ్రాహ్మణి తో మరియు కొడుకుతో చెప్పానని పేర్కొన్నాడు. 400 రోజుల పాటు ఇంటి మొహం చూడకుండా కేవలం ప్రజల్లోనే ఉంటూ పాదయాత్ర చేస్తూ రాష్ట్ర మొత్తం కవర్ చేయాలని నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు లోకేష్ కృషి చేయబోతున్నారు. మరో వైపు వైకాపా శ్రేణులు మాత్రం లోకేష్ పాదయాత్రతో ఒరిగేది ఏమీ లేదు అంటున్నారు.