Nara Lokesh Not Political Ability : పసలేని ప్రయాసలు.. ఢిల్లీలో కూడా పరువు తీసేసుకున్న లోకేష్ నాయుడు..!
NQ Staff - September 17, 2023 / 01:30 PM IST

Nara Lokesh Not Political Ability :
లోకేష్ ను చూస్తుంటే.. నలుపు ఎక్కడున్నానలుపే అనే సామెత గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉంటే.. ఇలాంటి సమయంలోనే తన నాయకత్వ సమర్థతను చూపించుకోవాల్సిన లోకేష్.. మళ్లీ తన అసమర్థతను నిరూపించు కుంటున్నాడు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు కాబట్టి.. ఇప్పుడు పార్టీని ఏకతాటి మీదకు తీసుకువచ్చి పోరాడేలా చేయాలి. అతే కాకుండా నిరసనలు, ధర్నాలతో హోరెత్తించాలి. అసమ్మతిలో ఉన్న వారిని కూడా బయటకు వచ్చేలా చయగలగాలి. న్యాయ పోరాటంతో చంద్రబాబును ఎలా బయటకు తేవాలో అని వ్యూహాలు రచించాలి.
అంతే గానీ లోకేష్ ఏపీలో కాడె పక్కన పడేసి ఢిల్లీ వెళ్లిపోయాడు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా అక్కడి మీడియాను మ్యానేజ్ చేస్తూ తమకు అనుకూలంగా వార్తలు వచ్చేలా జిమ్మిక్కులు చేసేవారు. ఇప్పుడు లోకేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అక్కడ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ చంద్రబాబుకు సింపతీ తీసుకురావాలని అనుకున్నాడు. కానీ బలమైన ప్రజెంటేషన్ ఇవ్వలేక తల పట్టుకుంటున్నాడు. ఇక్కడ న్యాయ వ్యవస్థలో వాడిన పసలేని స్పీచ్ ను అక్కడ ఇస్తున్నాడు. ఇక్కడ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతూ పప్పు అనే ముద్ర వేయించుకున్న ఈయన అక్కడ కూడా ఇలాగే చేస్తున్నాడు.
పైగా ఇంకో విచిత్రం ఏంటంటే.. అవినీతి నిరోధక కేసులో అరెస్ట్ చేసినా సరే ఆర్టికల్ 17 ఏ నిబంధన ప్రకారం ఫాలో కావాల్సిన రూల్స్ ను ఫాలో కాలేదని చెబుతున్నాడు. అంటే చంద్రబాబు అవినీతి చేసినా సరే సరిగ్గా అరెస్ట్ చేయలేదని లోకేష్ చెప్పకనే చెబుతున్నాడన్నమాట. ఇంతకన్నా ఇతను ఇంకేం మాట్లాడగలడు చెప్పండి. సబ్జెక్ట్ లేని స్పీచ్ ను జాతీయ మీడియా ముందు ఎంత మొరపెట్టుకున్నా సరే ఏం లాభం ఉంటుంది. ఎంత సేపు చంద్రబాబు స్కామ్ చేయలేదని.. జగన్ కుట్రలు చేస్తున్నాడని చెబుతున్నాడే తప్ప.. అసలు చంద్రబాబు స్కామ్ చేయలేదనడానికి ప్రూఫ్ ఏంటనేది మాత్రం చెప్పట్లేదు.
అసలు జాతీయ మీడియా ముందు మాట్లాడాలంటే పక్కా ప్రూఫ్ లతో సహా గట్టి ప్రజెంటేషన్ ఇవ్వాలి. అంతే గానీ పదే పదే చెప్పిందే చెప్పి సబ్జెక్ట్ లేని స్పీచ్ ఇస్తే ఏం లాభం.. ఎవరో రాసిచ్చిన పసలేని స్క్రిప్ట్ ను చదివి వినిపిస్తున్నాడు లోకేష్. పైగా ఫారెన్ లో చదువుకున్నాడు కాబట్టి ఇంగ్లిష్ అనర్గలంగా మాట్లాడుతాడేమో అనుకుంటే అక్కడ కూడా తడబడుతూ వస్తున్నాడు.
ఇప్పుడు ఆయన తీరిగ్గా వెళ్లి హస్తినాపురంలో కూర్చుండంతో ఇక్కడ ఏపీలో పార్టీ అల్లకల్లోలం అయిపోతోంది. అంటే ఇక్కడ లోకేష్ ఉన్నా పరిస్థితిలో పెద్దగా మార్పులు రావనుకోండి. చంద్రబాబు చేయగలిగే జిమ్మిక్కులు లోకేష్ కు తెలియవు. ఎవరో చెప్పింది ఫాలో అవడం తప్ప ఇంకేం చేయలేరు. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం లోకేష్ ను ఇంక టీడీపీ భవిష్యత్ నాయకుడు అనడం వేస్ట్ అని అంటున్నారు.