Nara Lokesh : లోకేష్ పాద యాత్ర కోసం భారీగా ఖర్చు.. ఆ డబ్బు అంతా ఎవరిది?
NQ Staff - January 24, 2023 / 09:56 AM IST

Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర చేయబోతున్న విషయం తెల్సిందే. 400 రోజుల పాటు 4000 కిలో మీటర్ల మేరకు పాద యాత్ర సాగబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్ంగా పాద యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం అయ్యింది.
ప్రభుత్వం నుండి కూడా కాస్త ఆలస్యంగా కొన్ని కండీషన్స్ తో అనుమతలు లభించాయి. పాద యాత్ర కోసం తెలుగు దేశం పార్టీ భారీ ఎత్తున ఖర్చు చేయబోతుంది అంటూ వైకాపా నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలను పాద యాత్ర పేరుతో ఖర్చు చేయాలని భావిస్తున్నారు అంటూ వైకాపా నాయకులు కామెంట్స్ చేశారు.
ఇప్పటికే నియోజక వర్గంకు ఇంత అంటూ ఆయా నియోజక వర్గం ఇంచార్జ్ లు ఖర్చు చేసే విధంగా ప్లాన్ చేశారట. అంతే కాకుండా లోకేష్ వెంట నడిచే వారికి.. వాహనాలకు కూడా భారీ ఎత్తున ఖర్చు అవ్వబోతుందని వైకాపా శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.
మీడియా కవరేజ్ మొదలుకుని అన్ని విషయాల్లో కూడా నారా లోకేష్ యొక్క యువగళం పాద యాత్ర ఖర్చు విషయంలో అత్యంత ఖరీదైన పాద యాత్రగా నిలుస్తుందని వైకాపా నాయకులు విమర్శిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు.