Nara Chandrababu Naidu : జగన్ వర్సెస్ చంద్రబాబు.! ఇది ఎవరి కర్మ.?

NQ Staff - December 2, 2022 / 12:56 PM IST

Nara Chandrababu Naidu  : జగన్ వర్సెస్ చంద్రబాబు.! ఇది ఎవరి కర్మ.?

Nara Chandrababu Naidu  : ఇదేం కర్మ బాబోయ్.! ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు ప్రధాన రాజకీయ పార్టీల గురించి చర్చించుకుంటున్న అంశమిది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘ఇదేం ఖర్మ’ అంటూ వైసీపీ మీద యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే.

2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. పర్యటనల జోరు పెంచారు.. జనంలోకి వెళుతున్నారు, వైసీపీ పాలనను ఎండగడుతున్నారు. రాజకీయాలన్నాక ఇంతే.! ప్రతిపక్షంలో ఎవరున్నా చేసేది ఇదే. అధికార పార్టీ అందుకు ధీటుగా బదులివ్వడమూ మామూలే.

వెన్నుపోట్లు.. గొడ్డలి పోట్లు.!

‘నువ్వొస్తే వెన్నుపోట్లు..’ అంటూ చంద్రబాబుకి వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు ఊరూవాడా కనిపిస్తున్నాయి. అందునా, చంద్రబాబు పర్యటనల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వైసీపీ వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. మరోపక్క, ‘రాష్ట్రానికి కర్మ పట్టింది.. అదీ జగన్ కారణంగా..’ అంటూ టీడీపీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.

ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు.. ఇవేవీ చర్చనీయాంశాలు కావడంలేదు. కేవలం చంద్రబాబు వర్సెస్ వైఎస్ జగన్ అనే వికృత రాజకీయ క్రీడ మాత్రమే నడుస్తోందా.? అంటే, ఔనని చెప్పక తప్పదేమో.

అయినా, విపక్షాల రాజకీయ యాత్రల సందర్భంగా అధికార పార్టీ ఎందుకు కవ్వింపు చర్యలకు దిగుతోంది.? ఈ కవ్వింపు చర్యలతో మరింత అభాసుపాలవడం తప్ప అధికార పార్టీకి ఒరిగేదేమీ వుండదు. చూస్తేంటే చంద్రబాబు ట్రాప్‌లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us