Nara Bhuvaneshwari : నాకు అండ‌గా ఉన్నందుకు ధ‌న్య‌వాదాలు.. ఈ అన్యాయం మ‌రెవ‌రికి జర‌గకూడ‌దు: భువ‌నేశ్వ‌రి

Nara Bhuvaneshwari : అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై నారా భువ‌నేశ్వ‌రి బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు.

TheNewsQube-
nara bhuvaneshwari thanks to supporters
nara bhuvaneshwari thanks to supporters

చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో ఉంటారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఅని తెలిపారు. కష్టాల్లో ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి అని సూచించారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు.

nara bhuvaneshwari thanks to supporters
nara bhuvaneshwari thanks to supporters

నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను అని అందులో పేర్కొన్నారు నారా భువనేశ్వరి. కాగా, ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తన భార్య భువనేశ్వరిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆయన ప్రెస్‌మీట్‌లోనే వెక్కి, వెక్కి ఏడ్చారు.

అసెంబ్లీ ఘటనను ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఖండించింది. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సైతం వైఎస్సార్సీపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ , బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్ రామ్ కూడా దీనిపై స్పందించారు.అయితే ఎన్టీఆర్ కామెంట్స్ ప‌ట్ల కొంద‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.