Nani : ఆ హీరోలు నన్ను తొక్కాలని చూస్తున్నారు.. నాని సంచలన కామెంట్లు..!
NQ Staff - January 27, 2023 / 11:08 AM IST

Nani : సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఓ విమర్శ ఉంది. అదేంటంటే చాలామంది హీరోలు మన టాలీవుడ్ లో తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుని వస్తున్న వారే. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు లాంటి వారు ఎవరి సపోర్టు లేకుండా స్టార్లుగా రాణించారు. వారే తప్ప వారి తర్వాత ఎవరూ ఆ స్థాయిలో రాణించలేదనే చెప్పుకోవాలి.
ఇక ఈ జనరేషన్ లో అయితే సినీ హీరోల్లో చాలా వరకు తాతలు, తండ్రుల బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. నిజంగా ట్యాలెంట్ చూపిస్తూ జనాలను మెప్పిస్తున్న హీరోలు చాలా తక్కువ మందే అని చెప్పుకోవాలి. ఇలాంటి వారిలో హీరో నాని కూడా ఒకడు. ఆయన కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో హీరో నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు.
ట్యాలెంట్ లేకపోయినా…
ఆయన గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. చాలా తక్కువ టైమ్ లోనే ఆయన మంచి ట్యాలెంట్ తో ఎదిగాడు. అయితే ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు ఎలాంటి ట్యాలెంట్ లేకపోయినా హీరోలుగా ఉన్నారు.
అందులో కొంతమంది నా లాంటి వారిని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ బాంబు పేల్చాడు. అప్పటి నుంచే నాని మీద స్టార్ హీరోలకు కాస్త కోపంగా ఉంది. అందుకే ఆయన సినిమాలకు ఆ హీరోల ఫ్యాన్స్ నెగెటివ్ టాక్ క్రియేట్ చేస్తుంటారు. అలాగే నాని సినిమాలు రిలీజ్ చేసే సమయంలోనే స్టార్ హీరోల సినిమాలు రావడం కూడా మనం చూడొచ్చు.