Nani : నాని భయ్యా.. మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?
NQ Staff - February 1, 2023 / 01:54 PM IST

Nani : నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా దసరా టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
టీజర్ విడుదల సమయంలో నాని మాట్లాడుతూ గత ఏడాది కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ కాంతార సినిమాల గురించి ఎలాగైతే మాట్లాడుకున్నారో ఈ ఏడాది మా దసరా సినిమా గురించి మాట్లాడుకుంటారని వ్యాఖ్యలు చేశాడు. తాజాగా మరోసారి ఒక ఈవెంట్ లో పాల్గొన్న నాని దసరా సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కచ్చితంగా దసరా సినిమా మరో లెవల్ లో ఉంటుందని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారని మరోసారి కాస్త పెద్ద పెద్ద మాటలు ఈ సినిమా గురించి నాని మాట్లాడటం జరిగింది. ఒక హీరోకు తాను నటించిన సినిమాపై నమ్మకం ఉండాలి, కానీ మరీ అతి విశ్వాసం పనికిరాదు.
దసరా విషయంలో నానికి విశ్వాసం ఉండడం పరవాలేదు.. కానీ మరి ఇంత ఓవరాక్షన్ గా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సక్సెస్ అయితే జనాలు మాట్లాడుకుంటారు.. ముందే జనాలు మాట్లాడు కోబోతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కదా అనేది కొందరి అభిప్రాయం.
అభిమానులు మాత్రం నాని వ్యాఖ్యలపై తో చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు దసరా సినిమా విడుదలవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.