Nani: కొత్త క‌థ‌లు విన‌కూడ‌ద‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న నాని

Nani: బిజీ అనే పదానికి ప్యాంటు షర్టు వేస్తే అది నానిలా ఉంటుందేమో..! ఎందుకంటే అంత బిజీగా ఉంటాడుఈ హీరో. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడు చేతి నిండా సినిమాలతో ఉంటాడు నాని. నాచురల్ స్టార్ కావడంతో దర్శకులు కూడా నాని కోసం ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తుంటారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నాచురల్ స్టార్. ఇదిలా ఉంటే కొత్త సినిమాల విషయంలో నాని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజులు కొత్త కథలు వినకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విడుదలైన తర్వాత కానీ ఆ వైపు వెళ్ళకూడదు అని ఈయన గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తుండటంతో వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు నాని. ఈ మూడింటిలో టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన సినిమా ఇది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు శ్యామ సింగ రాయ్ షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 40 కోట్లకు పైగా బడ్జెట్ తో చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

దాంతోపాటు అంటే సుందరానికి సినిమాకు కూడా కమిట్ అయ్యాడు నాని. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా ఇలాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న కుర్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ మూడు సినిమాలు విడుదలైన తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని కొత్త కథలు వినాలని నాని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.