Nandamuri Tarakaratna : హెల్త్ బులిటెన్.. విషమంగానే తారకరత్న ఆరోగ్యం
NQ Staff - January 28, 2023 / 03:09 PM IST

Nandamuri Tarakaratna : నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండె పోటుతో సొమ్మసిల్లి పడి పోయిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ మొదట చికిత్స చేయడం జరిగింది.
అత్యుత్తమ వైద్యం కోసం తారకరత్నను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కుప్పం నుండి బెంగళూరుకి తారకరత్నను తరలిస్తున్న సమయంలో కూడా ఆయన పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంది అంటూ ప్రచారం జరిగింది.

Nandamuri Tarakaratna Shifted Bangalore Narayana Hrudayalaya Hospital
నారాయణ హృదయాలయ ఆసుపత్రి నుండి ఎప్పుడెప్పుడు హెల్త్ బులిటెన్ వస్తుందా అంటూ నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వర్గాల వారు హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయనకు ప్రత్యేక బృందం చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం విషయమై మరికొన్ని రోజుల పాటు ఆందోళన తప్పదు అన్నట్లుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రి అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ని చూస్తుంటే అనిపిస్తోంది. నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తారకరత్న క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.