Nandamuri Tarakaratna : హైదరాబాద్ కు తారకరత్న.. ఏం జరుగుతుందంటూ ఫ్యాన్స్ టెన్షన్
NQ Staff - February 18, 2023 / 08:11 PM IST

Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కుటుంబ సభ్యుల నుండి సమాచారం అందుతుంది. గత మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో గుండె పోటుతో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.
తారకరత్న ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో నందమూరి బాలకృష్ణ తో పాటు పలువురు కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ వైద్యులతో నందమూరి కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్ కు తారకరత్నను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
ఏ క్షణంలో ఎలాంటి ప్రకటన వస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటీవలే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు, కానీ ఇంతలోనే ఆరోగ్యం విషమించిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపద్యంలో నందమూరి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.