Nandamuri Tarakaratna : మితిమీరిన మద్యం అలవాటు తారకరత్న కొంపముంచిందా?
NQ Staff - January 30, 2023 / 09:13 AM IST

Nandamuri Tarakaratna : లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది అంటూ కుటుంబ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందజేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో నారాయణ హృదయాలయ వైద్యులు కుటుంబ సభ్యులతో తారకరత్న యొక్క మితిమీరిన మద్యం అలవాటు కొంపముంచింది అన్నట్లుగా సమాచారం అందుతుంది.
డే అండ్ నైట్ మద్యం తాగడం వల్లే తారకరత్న ఆరోగ్యం బాగా క్షీణించిందని.. ఇదే సమయంలో గుండె పోటు రావడంతో ఆయన కోలుకోలేక పోతున్నాడు అంటూ కుటుంబ సభ్యులతో తారకరత్న ఆరోగ్య విషయం నారాయణ హృదయాలయ వైద్యులు చెప్పారట.
90:10% నుండి సీరియస్ కండిషన్ నుండి 60:40% కి తీసుకొచ్చిన ప్రత్యేక వైద్య బృందం తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. కానీ డేంజర్ నుండి మాత్రం బయట పడలేదని వైద్యులు కుటుంబ సభ్యులతో పేర్కొన్నారట. నందమూరి అభిమానులు టీడీపీ శ్రేణులు తారక రత్న ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారు.