Nandamuri Tarakaratna : చివరి కోరిక తీరకుండానే మరణించిన తారకరత్న.. శోకసంద్రంలో భార్య..!
NQ Staff - February 19, 2023 / 11:03 AM IST

Nandamuri Tarakaratna : నందమూరి కుటుంబంలో మరో విషాదం అలుముకుంది. నందమూరి తారకరత్న మరణ వార్త అటు రాజకీయాల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న సడెన్ గా గుండెపోటుతో కింద పడిపోయిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయన్న వెంటనే కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆయన కోమాలోకి వెళ్లిపోవడంతో ఆయన్ను అక్కడి నుంచి బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గత 23 రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్నారు తారకరత్న. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని నందమూరి ఫ్యామిలీ మొత్తం కోరుకుంది. కానీ ఏ వార్త అయితే వినకూడదని అంతా ప్రార్థించారో చివరకు అదే జరిగింది.
సినీ కెరీర్ కూడా..
ఆయన కోమాలో ప్రాణాలు వదిలారు. నిన్న 18వ తేదీన ఆయన రాత్రి పదిగంటల సమయంలో మరణించారు. అయితే తారకరత్న చివరి కోరిక తీరకుండానే మరణించారు. ఆయన గతంలో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. తాతకు తగ్గ మనవడిగా రాణించాలని ఆశ పడ్డారు. కానీ ఆయన సినీ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది.
ఇక రీసెంట్ గానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాతలాగే ప్రజా సేవ చేయాలని ఆశించారు. కానీ రాజకీయ జీవితం కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆయన చివరి కోరిక అయిన ప్రజాసేవలో ఉండకుండా ఆయన అర్థాంతరంగా చాలా చిన్న వయసులోనే వెళ్లిపోవడం నందమూరి ఫ్యామిలీని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.