Venu Swamy : సంచలనం.. తారకరత్న తర్వాత చనిపోయేది ఆ హీరోయినేనా.. అంతా టెన్షన్..!
NQ Staff - February 21, 2023 / 11:00 AM IST

Venu Swamy : తారకరత్న మరణంతో ఇండస్ట్రీలో అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తారకరత్నది సహజ మరణమే. ఆయన గుండెపోటు కారణంగా కోమాలోకి వెళ్లిపోయారు. దాదాపు 23 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చివరకు తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణంతో ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే.
ఆయన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతుంటారు. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజం అయ్యాయి కూడా. అప్పట్లో సమంత విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పాడు. చివరకు అదే జరిగింది. మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో త్వరలో 45 ఏండ్ల లోపు ఉన్న మిధున రాశికి చెందిన ఓ యంగ్ హీరో, మేషరాశికి చెందిన ఓ యంగ్ హీరోయిన్ చనిపోతారని చెప్పాడు.
వేణుస్వామి చెప్పడంతో..
తారకరత్న చనిపోవడంతో ఆయన మాటలు సంచలనం రేపాయి. అంటే వేణు స్వామి ముందే చెప్పినట్టే తారకరత్న చనిపోయాడని అంతా కామెంట్లు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు తర్వాత చనిపోయే మరో హీరోయిన్ ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. వేణుస్వామి చెప్పిన ఆ మరో హీరోయిన్ కోసం అంతా వెతుకులాట ప్రారంభించారు.
కొందరు అయితే సోషల్ మీడియా వేదికగా ఆ హీరోయిన్ పేరును కూడా చెప్పేస్తున్నారు. పలానా హీరోయినే త్వరలో చనిపోయేది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చనీయాంశం అయిపోయింది. ఈ క్రమంలోనే కొందరు వేణుస్వామిని తిట్టిపోస్తున్నారు. నువ్వేమైనా దేవుడివా అన్నీ నీకే తెలుస్తాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు.