Nandamuri Balakrishna Was Chief Guest At Pre Release Event Of Rudrangi : నేను సెక్సీ ఏంటి.. సుమ, మమత మోహన్ దాస్ ఫీలవుతారు.. బాలయ్య కామెంట్లు..!
NQ Staff - June 30, 2023 / 10:05 AM IST

Nandamuri Balakrishna Was Chief Guest At Pre Release Event Of Rudrangi :
నందూమరి నటసింహం బాలయ్య అప్పుడప్పుడు ఫన్నీ కామెంట్లతో అలరించేస్తుంటారు. ఆయన చేసే కామెంట్లుకొన్ని సార్లు వల్గర్ గా అనిపిస్తాయి కానీ.. ఆయన మాత్రం మనసులో ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోకుండా బయటకు అనేస్తుంటారు. అది ఆయన మనస్తత్వం. అందుకే ఆయన్ను అందరూ బోలా మనిషి అని పిలుస్తారు.
ఇక తాజాగా ఆయన మరోసారి తనలోని చిలిపి తనాన్ని బయట పెట్టేశారు. తాజాగా జగపతి బాబు నటించిన మూవీ రుద్రంగి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించగా బాలయ్య బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడబోతుంటే.. కోకాకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ అంటూ ఫ్యాన్స్ అరిచారు.
సుమపై పాట..
అది విన్న బాలయ్య.. ఎహే ఆపండి.. నేను సెక్సీ ఏంటి.. యాంకర్ సుమ, మమత మోహన్ దాస్ ఫీల్ అవుతారు అంటూ తనదైన శైలిలో అలరించారు. ఆ తర్వాత సుమపై కూడా కొద్దిసేపు ఫన్నీ కామెంట్లు చేశారు. పోరీ హుషారుగుందిరోయ్ అంటూ ఆమె మీద సరదాగా పాట కూడా పాడాడు.
అనంతరం జగపతి బాబు గురించి మాట్లాడుతూ.. ఆయన తన కష్టంతో పైకి వచ్చిన మనిషి. తనదైన శైలిలో నటిస్తూ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు బాలయ్య. కొద్ది సేపు తెలంగాణ యాసలో కూడా మాట్లాడాడు.