Nandamuri Balakrishna : ఐపీఎల్‌ కామెంటేటర్ గా బాలకృష్ణ.. ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం

NQ Staff - March 26, 2023 / 07:34 PM IST

Nandamuri Balakrishna : ఐపీఎల్‌ కామెంటేటర్ గా బాలకృష్ణ.. ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం

Nandamuri Balakrishna : ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. సినిమాల్లో సూపర్ హిట్స్ దక్కించుకుంటూ దూసుకు పోతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంతో ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ లో కూడా బాలకృష్ణ సందడి చేశాడు. ఇక త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ మెగా క్రికెట్ వేడుక ప్రారంభోత్సవ మ్యాచ్ కి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించ బోతున్నాడు.

స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ లో లైవ్ స్ట్రీమింగ్ కాబోతున్న క్రికెట్ మ్యాచ్ కి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన స్టార్ స్పోర్ట్స్ తెలుగు విడుదల చేయడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

తనకు నచ్చిన ఆటలో కామెంటేటర్‌ గా రావడం సంతోషంగా ఉందని, ఆట ఆడుతున్నంత సంతృప్తిని ఇస్తుందని బాలకృష్ణ పేర్కొన్నాడు. మొత్తానికి బాలకృష్ణను మరో కొత్త రూపంలో చూడబోతున్నందుకు ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us