Jr NTR : గుడ్డలూడదీసి కొడుతా.. ఆ హీరోకు వార్నింగ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..!
NQ Staff - February 27, 2023 / 01:11 PM IST

Jr NTR : నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు స్టార్ హీరో అంటే అందరికీ టక్కున జూనియర్ ఎన్టీఆరే గుర్తుకు వస్తారు. ఆ రేంజ్ లో ఆయన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎంత నందమూరి ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా సరే.. ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను తెచ్చుకున్నారు. ఈ జర్నీలో ఆయన పడ్డ అవమానాలు, కష్టాలు చాలానే ఉన్నాయి.
కాగా ఎంత నందమూరి హీరో అని చెబుతున్నా కూడా.. బాలయ్యకు మాత్రం ఆయన మీద పెద్దగా ప్రేమ ఉండేది కాదు. ఈ విషయాలను ఆయన గతంలో మాట్లాడిన మాటలే నిరూపిస్తున్నాయి. మొదట్లో జూనియర్ ఎన్టీఆర్‌ను నందమూరి హీరోగా బాలయ్య యాక్సెప్ట్ చేయలేదు. ఆ క్రమంలోనే కొన్ని సార్లు బాలయ్య టంగ్ స్లిప్ అయిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఆ డైలాగ్ తో కౌంటర్..
ఓ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను ఇన్ డైరెక్టుగా బుడ్డోడు అంటూ అవమానించాడు. అయితే ఎన్టీఆర్ ఆ మాటలను కాస్త సీరియస్ గానే తీసుకున్నాడు. అందుకే తన సినిమాలో ఓ డైలాగ్ ను పెట్టించాడు. బుడ్డోడు, బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడుతా అంటూ డైలాగ్ రాయించాడు.
కాగా ఈ డైలాగ్ ఎన్టీఆర్ కావాలనే పెట్టించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. బాలయ్యను ఉద్దేశించే ఈ డైలాగ్ ను ఎన్టీఆర్ పెట్టించాడని అప్పట్లో వీడియోలు చేసి వైరల్ చేశారు కొందరు నెటిజన్లు. కానీ ఈ వీడియోలపై బాలయ్య మత్రం స్పందించలేదు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం అప్పట్లో సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. కానీ తర్వాత కాలంలో ఎన్టీఆర్ ను బాలయ్య దగ్గరకు తీసుకోవడంతో గొడవలన్నీ ముగిసిపోయాయి.