Nandamuri Balakrishna Comments On Suma Kanakala : ఎహే.. ఆపు.. ఊకే లొడలొడ వాగుతావ్.. యాంకర్ సుమపై బాలయ్య ఫైర్..!
NQ Staff - June 30, 2023 / 09:44 AM IST

Nandamuri Balakrishna Comments On Suma Kanakala :
బాలయ్య బాబు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఆయన్ను అందరూ బోలా మనిషి అని పిలుస్తారు. కాస్త కసిరినట్టు మాట్లాడినా ఆయన మాటలో మాధుర్యమే ఉంటుంది. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఇక రీసెంట్ గానే క్యాన్సర్ ఆస్పత్రి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. మొన్ననే యూఎస్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు వైరల్అవుతున్నాయి. జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన మూవీ రుద్రంగి.
ఈ సినిమా జులై 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి బాలయ్య స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అతిథులందరినీ స్టేజిపైకి ఆహ్వానించింది. ఒక్కొక్కరి గురించి టకటకా చెప్పేసింది.
ఇక జగపతి బాబు మైక్ తీసుకుని మాట్లాడబోతుంటే.. ఆయన్ను మాట్లాడినవ్వకుండా పొగిడే కార్యక్రమం పెట్టుకుంది. దీంతో వెనకాలే ఉన్న బాలయ్య.. ఎహే ఆపు.. ఊరికే లొడలొడ వాగుతున్నావ్ అంటూ సరదాగా అన్నారు. దాంతో ఒక్కసారిగా సుమ ఉలిక్కి పడింది. కానీ బాలయ్య సరదాగా అన్నాడని అర్థం చేసుకుని నవ్వేసింది.