Unstoppable : బాలయ్య ‘అన్ స్టాపబుల్ 2’.! ‘ఆహా’ సాంగ్ వచ్చేసిందహో.!
NQ Staff - September 27, 2022 / 08:25 PM IST

Unstoppable : నందమూరి బాలకృష్ణ అభిమానులు తమ అభిమాన హీరో నుంచి ఎలాంటి అప్‌డేట్ వస్తుంటుందా.? అని ఎప్పటికప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్. ప్రస్తుతం విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
కాగా, బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్’ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. ఆహా ఓటీటీ వేదికగా ఈ షో ఓ రేంజ్‌లో సక్సెస్ అయ్యింది. పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. మహేష్‌బాబు సహా పలువురు ప్రముఖులు ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో, బాలయ్యతో కలిసి హంగామా సృష్టించారు.
మరి, సీజన్ ఎలా వుండబోతోంది.? ఇదిగో ఇంట్రో సాంగ్.!
సీజన్ టూ ఎలా వుండబోతోంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. కొత్తగా ఎవర్ని ఈ సీజన్ కోసం ‘ఆహా’ టీమ్ తీసుకొస్తుంది.? అన్న ఉత్కంఠకైతే ఇంకా తెరపడలేదు. కానీ, ‘అన్ స్టాపబుల్ 2’ కోసం ఓ సాంగ్‌ని డిజైన్ చేశారు. బాలయ్య గురించి పేర్కొంటూ రోల్ రైడా అదరగొట్టేశాడు.
ఇలా సాంగ్ విడుదలయ్యిందో లేదో అలా ఈ సాంగ్ వైరల్ అవుతోంది. సెకెండ్ సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవిని నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అదే నిజమైతే, రెండో సీజన్‌కి ఇదే హైలైట్ ఇంటర్వ్యూ అవుతుంది. సమంత, అనుష్క తదితరులూ లిస్టులో వున్నారు.