Nagarjuna : బాలయ్య స్పందించినా కోపంగానే ఉన్న నాగార్జున.. ఆ పని చేయబోతున్నాడా..?
NQ Staff - January 27, 2023 / 11:14 AM IST

Nagarjuna : బాలయ్య రగిల్చిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది. చూస్తుంటే ఇప్పట్లో ఆ వివాదం చల్లారే విధంగా కనిపించట్లేదు. బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏదైనా స్టేజి మీద మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు కూడా సరిగ్గా తెలియదు. గతంలో ఎన్నో సార్లు నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
గతంలో చాలా సార్లు నోరు జారి చేసిన కామెంట్లకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఆ రంగారావు, ఈ రంగారావు, ఈ అక్కినేని తొక్కినేని అంటూ నోరు జారాడు. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఏఎన్నార్‌ను అవమానించాడు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ కూడా దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయింది.
క్షమాపణ చెప్పని బాలయ్య..
ఇదే ఇష్యూ మీద బాలయ్య తాజాగా స్పందించాడు. తాను కావాలని అలాంటి కామెంట్లు చేయలేదని, ఏఎన్నార్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, తాను చేసిన కామెంట్లను తప్పుగా ప్రచారం చేస్తే తన బాధ్యత ఉండదని చెప్పాడు. అంతే గానీ ఆయన స్పందనలో ఎక్కాడ కూడా క్షమాపణలు చెప్పలేదు.
తాను ఏం తప్పు అనలేదని మాత్రమే బాలయ్య వాదిస్తున్నాడు. కాగా ఆయన క్షమాపణ చెప్పకపోవడం నాగార్జున ఇంకా కోపంగానే ఉన్నాడంట. బాలయ్య తీసే ఏ సినిమాకు కూడా తన అన్నపూర్ణ స్టూడియోలో పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్డూడియోలోకి బాలయ్యను అడుగు పెట్టనివ్వకూడదని భావిస్తున్నాడు నాగార్జున. చూడాలి మరి ఈ యవ్వారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో.