Aadi Reddy : బిగ్ ఫ్లాప్ షో : ఆది రెడ్డి అభిమానులు ఆగమాగం అవుతున్నారే.!
NQ Staff - December 4, 2022 / 10:30 AM IST

Aadi Reddy : ‘నాన్సెన్స్’ అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్ ఆది రెడ్డి మీద మండిపడటంతో, ఒక్కసారిగా ఆది రెడ్డి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జునపై బూతులతో విరుచుకుపడుతున్నారు. ఆది రెడ్డి ఫాలోవర్స్.
గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలకు విశ్లషకుడిగా సోషల్ మీడియాలో బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. ఆ విశ్లేషణతోనే హౌస్‌లో అందరికీ క్లాసులు పీకుతున్నాడు. మాటలు ట్విస్ట్ చేస్తున్నాడు. ఇతర కంటెస్టెంట్లను జనం ముందర నిందితులుగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
రేవంత్ తప్పేమీ లేదు..
ఓ టాస్క్ సందర్భంగా, ‘అమ్మాయిలు బలహీనులు’ అని రేవంత్ అన్నాడన్నది ఆది రెడ్డి ఆరోపణ. రేవంత్ అలా అనలేదని, ఆ ఫుటేజ్ విడుదల చేసి మరీ నాగ్ నిరూపించాడు. దాంతో ఆది రెడ్డి షరామామూలుగానే సోది చెప్పేందుకు ప్రయత్నించాడు. నాగ్ అతన్ని ‘నాన్సెన్స్’ అంటూ ఆపేశాడు.
‘బిగ్ ఫ్లాప్ షో’ అంటూ ఆరో సీజన్ గురించి ఆది రెడ్డి అభిమానులు అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేస్తున్నారు. ఆది రెడ్డిని అన్యాయంగా తొక్కి పెడుతున్నారన్నది వారి ఆరోపణ. అసలు ఆది రెడ్డికి అభిమానులేంటి.? అనే డౌట్ మీకొస్తే.. అది మీ తప్పు కానే కాదు. ఇది బిగ్ బాస్.. ఇక్కడంతా పెయిడ్ అభిమానులే వుంటారు.