Nagarjuna And Roja : అక్కినేని నాగార్జునతో రోజా మంతనాలు.! పిక్స్ వైరల్.!

NQ Staff - November 27, 2022 / 10:47 PM IST

Nagarjuna And Roja : అక్కినేని నాగార్జునతో రోజా మంతనాలు.! పిక్స్ వైరల్.!

Nagarjuna And Roja : సినీ నటుడు అక్కినేని నాగార్జునకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో నాగార్జున విజయవాడ నుంచి వైసీపీ తరఫున లోక్‌సభకు పోటీ చేయాలనుకుంటున్నారంటూ ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం తనకు లేదని అక్కినేని నాగార్జున స్పష్టతనిచ్చేశారు. ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరలేదనీ, అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు వున్నాయని నాగార్జున చెప్పారు.

రోజాతో మంతనాల వెనుక..

Nagarjuna And Roja Meet At Ali Daughter Wedding

Nagarjuna And Roja Meet At Ali Daughter Wedding

తాజాగా ఏపీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే రోజాతో అక్కినేని నాగార్జున మంతనాలు జరిపారు. మంతనాలనడం కంటే, కులాసా కబుర్లని అనుకోవచ్చేమో.

Nagarjuna And Roja Meet At Ali Daughter Wedding

Nagarjuna And Roja Meet At Ali Daughter Wedding

సినీ నటుడు, వైసీపీ నేత, ఏపీ డిజిటల్ మీడియా సలహాదారు అలీ కుమార్తె పెళ్ళి వేడుకలో అక్కినేని నాగార్జున, రోజా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా జరిగిన మాటా మంతీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో నాగార్జున – రోజా కలిసి ‘వజ్రం’, ‘అన్నమయ్య’ తదితర సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Nagarjuna And Roja Meet At Ali Daughter Wedding

Nagarjuna And Roja Meet At Ali Daughter Wedding

సినిమాలకు సంబంధించిన ముచ్చట్లే ఇద్దరి మధ్యా చర్చకు వచ్చాయా.? లేదంటే, రాజకీయాల ప్రస్తావన ఏమైనా వచ్చిందా.? ఏమోగానీ, ఈ పిక్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us