Samantha And Naga Chaithanya : సమంతతో మామూలుగా వుండదు మరి.!

NQ Staff - June 21, 2022 / 05:03 PM IST

134863Samantha And Naga Chaithanya : సమంతతో మామూలుగా వుండదు మరి.!

Samantha And Naga Chaithanya : ‘నాతో మామూలుగా వుండదు..’ అంటూ ‘ఓ బేబీ’ సినిమాలో హీరోయిన్ సమంత ఓ డైలాగ్ చెబుతుంది. ఆ డైలాగ్ అప్పట్లో సూపర్ పాపులర్. నిజమే, సమంతతో వ్యవహారం మామూలుగా వుండదు. ఆమెనెవరైనా ట్రోల్ చేస్తే, సమాధానం చాలా చాలా గట్టిగా వుంటుంది. ఆ విషయం పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది కూడా. అందుకే, సమంతని ఇంకాస్త గట్టిగా ర్యాగింగ్ చేస్తుంటారు నెటిజన్లు.

సమంత ‘కాఫీ విత్ కరణ్ షో’లో ఏం మాట్లాడింది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అక్కినేని నాగచైతన్యతో విడాకుల గురించి ‘వాస్తవాల్ని’ సమంత చెప్పేసిందంటూ మీడియాలో కనిపిస్తున్న ఊహాగానాలతో, అక్కినేని నాగచైతన్య అభిమానులు గుస్సా అవుతున్నారు.

 Nagachaithanya Fans Trolling Samantha

Nagachaithanya Fans Trolling Samantha

వై సమంత.? వై నాట్ నాగచైతన్య.?

నిజానికి, ఇలాంటి సందర్భంలో కొందరు అగ్నికి ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆటోమేటిక్‌గా సమంత అభిమానులకీ, నాగచైతన్య అభిమానులకీ మధ్య ఆ వ్యవహారం మరింత ముదిరి పాకాన పడుతుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం అభినందనీయమే.

 Nagachaithanya Fans Trolling Samantha

Nagachaithanya Fans Trolling Samantha

సమంత సైతం, అనవసరంగా ‘ట్రోల్స్’ మీద స్పందించడం మానేస్తే బెటర్.. అన్న వాదన కూడా లేకపోలేదు. కానీ, సమంత ‘తగ్గేదే లే’ అంటోంది. అక్కడే వస్తోంది అసలు సమస్య. ఇది ఇప్పట్లో తెగే వ్యవహారమే కాదు. సమంత ఏదన్నా ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేస్తే, ఆ వెంటనే జుగుప్సాకరమైన కామెంట్లు మొదలైపోతున్నాయ్. సమంత స్పందిస్తే, ట్రోల్స్ చేసేవారికీ పాపులారిటీ పెరుగుతుండడం గమనార్హం.