నిహారిక ఎవడితోనో వెళ్ళిపోయింది, అందరిని చంపేద్దాం అనుకున్న : నాగబాబు

Advertisement

మెగా కూతురు నిహారిక కొణిదెలకు ఇటీవలే ఎంగేజిమెంట్ అయిన విషయం తెలిసిందే. అయితే నిహారిక, తన తండ్రి నాగ బాబు ఈ ఇద్దరు తండ్రికూతుళ్ళ బంధం అందరికి భలే ముచ్చటేస్తుంది. కూతురంటే ఎంత ప్రాణమో ఎన్నో సందర్భాల్లో బహిరంగంగా చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు నాగబాబు. అలాగే తండ్రి అంటే కూడా చాలా ఇష్టమని నిహారిక కూడా పలుమార్లు చెప్పుకొచ్చింది.

తాజాగా బాపుబొమ్మకు పెళ్లంట అంటూ ఒక ప్రోమోను విడుదల చేసారు. ఇక ఆ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో నిహారిక, నాగబాబుల మధ్య ఉన్న అనుబంధాన్ని అందరికి తెలియజేసాడు నాగబాబు. దీనితో నాగబాబు తన గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఒకానొక సమయాన కూతురి కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నడట నాగబాబు.

అయితే ఒకసారి నాగబాబు కుటుంబం మొత్తం న్యూజిలాండ్ కి వెళ్లారు. అయితే అప్పుడు నానబాబు నల్లకోటు ధరించాడు అంట, ఇక తన కూతురు నిహారిక తన నాన్నే అనుకోని ఎవరో నల్లకోటు ధరించిన వ్యక్తితో వెళ్ళిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు నిహారిక కనిపించకుండా పోయింది అంట. ఇక నాగబాబుకు బుర్ర పనిచేయలేదు. ఇక తన మనుసులో ఎలా అనిపించింది అంటే.. న్యూజిలాండ్‌లో ఉన్న వారందరిని చంపేద్దాం అనుకున్నా అని చెప్పాడు నాగబాబు.

ఇక అప్పుడు వరుణ్‌ని ఇంటికి పంపించి నాగబాబు, తన భార్య పద్మ ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నాం అని అన్నాడు. అలాగే నా కూతురు లేకపోతే నేను బతికి ఉన్న చచ్చిన వేస్ట్ అనేంత పిచ్చ వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా ఏ పుణ్యం చేసుకుంటే కూతుళ్లు పుడుతారో కానీ, నాకు పుట్టిన నా కూతురు నిహారిక మాత్రం నేను ఎంత అదృష్ట్యం చేసుకుంటే పుట్టిందో.. అంటూ తన కూతురి పై విపరీతమైన ప్రేమ చూపించాడు నాగబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here